Breaking: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి భారీ మెజార్టీతో బీజేపీ అభ్యర్ధి భరత్ కుమార్ పై విజయం సాధించారు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల బరిలో లేకపోవడంతో లక్ష ఓట్ల మెజార్టీ సాధిస్తామని వైసీపీ చెబుతూనే వచ్చింది. అయితే పోలింగ్ శాతం తగ్గడంతో 82వేల ఓట్ల ఆధిక్యతతో మేకపాటి విక్రమ్ రెడ్డి ఘన విజయం సాధించారు. . ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కళాశాల లో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. 14 టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. మొత్తం 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రతి రౌండ్ లోనూ వైసీపీ లీడ్ కొనసాగింది.
ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సరికి వైసీపీ అభ్యర్ధికి 1,02240 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్ధికి 19352 మాత్రమే వచ్చాయి. 82888 ఓట్ల అధిక్యతతో వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి విజయం సాధించారు. బీజేపీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల పరిశీలకులు సురేష్ కుమార్, రిటర్నింగ్ అధికారి హేరేందిర పరిశీలిస్తున్నారు. ఓట్ల లెక్కింపు మధ్యలోనే బీజేపీ అభ్యర్ధి భరత్ కుమార్ యాదవ్ కౌంటింగ్ కేంద్రం నుండి నిష్క్రమించారు. భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్ధి విజయంతో ఆ పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు.
Atmakur Bypoll: ఆత్మకూరు అసలు నిజాలు ఇవీ..! వైసీపీ మెజారిటీ పక్కా లెక్క..!!
వైసీపీ లక్ష మెజార్టీ లెక్కలు వేసుకుంటున్నప్పటికీ 75 నుండి 85వేల మధ్య మెజార్టీ వస్తుందని ‘న్యూస్ ఆర్బిట్’ ముందుగానే కథనాన్ని ఇవ్వడం జరిగింది. బీజేపీకి 18 నుండి 22 వేల మధ్య ఓట్లు పోల్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా పేర్కొనగా అదే విధంగా 19వేల ఓట్లు వచ్చాయి. ‘న్యూస్ ఆర్బిట్’ అంచనాలకు అనుగుణంగా ఆత్మకూరు బైపోల్ ఫలితం వచ్చింది. ఆత్మకూరులో క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితుల అంచనా అధారంగా ‘న్యూస్ ఆర్బిట్’ .. వైసీపీకి 80వేల మెజార్టీ వస్తుందని చెప్పడం జరిగింది. ఇంతకు ముందు తిరుపతి, బద్వేల్ ఉప ఎన్నికల ఫలితాల సమయంలోనూ న్యూస్ ఆర్బిట్ అంచనాల లెక్క తప్పలేదు.
విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…
బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…
తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…
వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…
ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జగన్నాథ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. దూరదర్శన్లో అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ ప్రారంభించి పూరి జగన్నాథ్.. ఆ తర్వాత…