ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: టీడీపీకి దివ్యవాణి బిగ్ షాక్..పార్టీకి రాజీనామా

Share

Breaking: ప్రముఖ సినీనటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఒంగోలులో జరిగిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ఆనందంలో ఉన్న టీడీపీకి దివ్యవాణి ఊహించని దెబ్బ వేశారు. టీడీపీలో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న దివ్యవాణి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు నేడు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్యవాణి తెలిపారు. ఇంత వరకు తనను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.

Breaking Divyavani resigns Telugu Desam Party
Breaking Divyavani resigns Telugu Desam Party

Breaking: మహానాడులో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని..

మహానాడులో తనకు ఘోర అవమానం జరిగిందని, కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని దివ్యవాణి సోమవారం ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. టీడీపీకి తాను నిస్వార్ధంగా సేవ చేస్తున్నా గుర్తింపు లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కళాకారుడు (ఎన్టీఆర్) స్థాపించిన పార్టీలో కళాకారులకు స్థానం లేకపోవడం తనని ఆవేదనకు గురి చేస్తొందని దివ్యవాణి అన్నారు. నిన్న యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తన ఆవేదనను వ్యక్తం చేసిన దివ్యవాణి .. నేడు ట్విట్టర్ వేదికగా తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు. మహానాడులో తనకు జరిగిన అవమానంతో మనస్థాపంతోనే దివ్యవాణి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది. త్వరలో దివ్యవాణి వైసీపీ లో చేరనున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

 

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన దివ్యవాణి సర్దార్ కృష్ణమనాయుడు చిత్రం ద్వారా బాలనటిగా సినీరంగ ప్రవేశం చేశారు. సుమారు 40కిపైగా తెలుగు సినిమాలో నటించిన దివ్యవాణి పుత్తడిబొమ్మ వంటి కొన్ని టీవీ సీరియల్స్ లో కూడా నటించారు. 2019 ఎన్నికలకు ముందు టీడీపీలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ ఆమెకు అధికార ప్రతినిధిగా నియమించడంతో అధికార పక్ష నేతలపై తీవ్ర స్థాయిలో తన దైన వాగ్ధాటితో విమర్శలు చేస్తూ ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా పేరుతెచ్చుకున్నారు.


Share

Related posts

YS Jagan: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శలపై జగన్ ఫస్ట్ రియాక్షన్..!!

sekhar

Colgate: మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా?? అని అడిగిన కంపెనీకి… మీ టూత్ పేస్ట్ లో మోసం ఉంది అంటున్న న్యాయవాది.

Naina

బ్రేకింగ్: బిగ్ బాస్ ఎంట్రీస్ లో న్యూ ట్విస్ట్.. కంటెస్టెంట్స్ చేతిలో సెలక్షన్

Vihari