Breaking: వైసీపీ ఎమ్మెల్యే అనంత ఉదయ్ భాస్కర్ బాబు (ఆనంత బాబు) పై పార్టీ వేటు వేసింది. తన డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంత బాబు ముద్దాయిగా ఉండటంతో పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాకినాడలో ఎమ్మెల్యే ఆనంత బాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచనం అయ్యింది. బాదితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఎమ్మెల్సీ ఆనంత బాబుపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పోలీసుల విచారణలో అనంత బాబు తాను కొట్టడం వల్లనే సుబ్రమణ్యం గాయపడి మృతి చెందినట్లు వ్యాగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పాార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. అనంత బాబును ఎమ్మెల్సీ పదవి నుండి తొలగించాలనీ, పార్టీ నుండి సస్పెండ్ చేయాలని బాధిత కుటుంబంతో పాటు దళిత సంఘాలు డిమాండ్ చేస్తూ కాకినాడలో ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనంత ఉదయ్ భాస్కర్ బాబు (అనంత బాబు)ను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఒ ప్రకటన విడుదల చేసింది.