ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Breaking: గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత.. లోకేష్ కాన్వాయ్ ని అడ్డుకున్న వైసీపీ శ్రేణులు..

Share

Breaking: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టిడిపి నేత నారా లోకేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు చీరాల మండలం తుమ్మపూడి గ్రామానికి వెళ్లగా వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వాళ్లు కొబ్బరి బోండాలు విసురుకున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఘటనలో టిడిపి వైసిపి కార్యకర్తలతో పాటు పలువురు పోలీసు లకు గాయాలయ్యాయి. వైసిపి కార్యకర్తలు కావాలనే లోకేష్ పై దాడికి ప్రయత్నించారనిటిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా లోకేష్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నేతలకు చట్టాలపై గౌరవం, భయం లేదని అన్నారు.ప్రశ్నించే వారిపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు భయపడేది లేదని లోకేష్ అన్నారు.

మహిళలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఎనిమిది వందల మంది మహిళలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. నిన్న కొందరు వివాహితపై దాడి చేసి హత్య చేసినట్లు, ఘటనలో ముగ్గురి పాత్ర ఉందని హతురాలి బంధువులు చెబుతున్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ రాకముందే అత్యాచారం జరగలేదని ఎస్పీ ఎలా అన్నారు. ఆయనపై ఎవరి ఒత్తిడి ఉందని ప్రశ్నించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామంటూ.. దోషులను కఠినంగా శిక్షించాలని లోకేష్ డిమాండ్ చేశారు. హతురాలి ని కించపరిచే విధంగా వైసిపి నేతలు మాట్లాడుతున్నారు.

తుమ్మల పూడి లో లక్ష్మీ తిరుపతమ్మ అనే మహిళ బుధవారం రాత్రి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెపై అత్యాచారం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆమె మృతదేహం సమీపంలోని మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఇంట్లో ఉన్న సమయంలో ఈ దారుణానికి ఒంటరిగా ఉన్నట్లు తెలుస్తుంది. వివాహేతర సంబంధం కారణంగా ఈ హత్య జరిగింది వైసీపీ శ్రేణులు అంటున్నారు. ఈ బాధిత కుటుంబాన్ని లోకేష్ పరామర్శకు వచ్చిన సందర్భంలో ఉద్రిక్తత. భారీ పోలీస్ బందోబస్తు తో గ్రామం నుండి లోకేష్ ను చూస్తుంది.


Share

Related posts

Viral Image: వింత జంతువు అని దగ్గరికి వెళ్లిన పోలీసులు షాక్ అయ్యారు.. ఎందుకంటే..

bharani jella

టీటీడీ ఆస్తుల వేలంపై విమర్శల వెల్లువ: క్లారిటీ ఇచ్చిన చైర్మన్

somaraju sharma

చంద్రబాబు మీద రివర్స్ అవ్వబోతున్న సబ్బం హరి … కారణం చాలా స్ట్రాంగ్ !

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar