NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Brother Anil: బ్రదర్ అనిల్ మరో సీక్రెట్ మీటింగ్ ..!? బ్లాక్ మెయిలా – వ్యూహమా..!?

Brother Anil: వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టము అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో తలదూర్చము అంటున్నారు. కానీ బ్రదర్ అనిల్ పరోక్షంగా తెరవెనుక రాజకీయ వ్యూహాలు వేస్తూనే ఉన్నారు. సీక్రెట్ భేటీలు అవుతూనే ఉన్నారు. తాజాగా ఈ రోజు కూడా ఆయన విశాఖపట్నంలోని ఒక ప్రముఖ హోటల్ లో కొంత మంది క్రీస్టియన్ మత పెద్దలతో భేటీ అయ్యారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు జిల్లాల నుండి దాదాపు 150 నుండి 200 మంది క్రైస్టియన్ పెద్దలతో సమావేశం అయ్యారు. వాళ్ల సమస్యలు, తమ భవిష్యత్తు ఆలోచనలు, వాళ్ల మనసులో ఏముంది. రాజకీయంగా అవసరమైతే వాళ్లు సపోర్టు చేస్తారా..? లేదా.. వాళ్లు ప్రస్తుతం ఏ పార్టీకి మద్దతుగా ఉన్నారు..? తదితర రాజకీయ విషయాలపైనే చర్చ జరిగి ఉంటుంది. నిజానికి బ్రదర్ అనిల్ తనకు రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదు. తన కార్యక్రమాలు అన్నీ రాజకీయాలకు అతీతం అని రీసెంట్ గా ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆయన చెప్పిన ప్రకారం బ్రదర్ అనిల్ కు రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదనుకున్నా, వైఎస్ షర్మిలకు ఏపి రాజకీయాల్లో తలదూర్చే ఆలోచన లేదని అనుకున్నా ఈ సెక్రెట్ భేటీలు ఎందుకు..?

Brother Anil: తొలుత మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తో..

నెల రోజుల క్రితం బ్రదర్ అనిల్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ అయ్యారు. ఆ తరువాత విజయవాడ తదితర ప్రాంతాల్లో కొన్నివర్గాలతో భేటీ అయ్యారు. ఈ రోజు విశాఖలో మీటింగ్ పెట్టారు. ఆయనకు రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేకపోతే ఈ భేటీలు ఎందుకు పెట్టినట్లు..? రాజకీయంగా చైతన్యంగా ఉండే సామాజికవర్గాల పెద్దలతో సమావేశాలు నిర్వహించడంలో ఆంతర్యం ఏమిటి.?. ఏపి సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య విభేదాలు ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అన్నా చెళ్లెళ్ల మధ్య గ్యాప్ ఉన్న మాట వాస్తవమే. ఆ గ్యాప్ కారణంగానే ఆమె తెలంగాణ వెళ్లి పార్టీ పెట్టుకున్నారు. అయితే ఆమెకు అక్కడ రాజకీయంగా పెద్ద అవకాశం ఉండకపోవచ్చనే మాట వినబడుతోంది. ఆమె చేయించుకున్న సర్వేలలో కూడా ఒకటి రెండు సీట్లు కష్టమే అని చెబుతున్నారుట. ఒక వేళ బ్రదర్ అనిల్ ఏపి లో పార్టీ పెడితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ ని 2009 నుండి చూస్తూనే ఉన్నాము. ఒక్క స్థానంలో కూడా డిపాజిట్లు రాలేదు. ఆయనను కమిడియన్ గా చూస్తున్నారు. ఆయనను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రల్స్ చేస్తుంటారు.

Brother Anil: అన్నను దారిలోకి తెచ్చుకునేందుకే..?

నిజానికి కేఏ పాల్ కొన్ని విషయాలు చాలా సబ్జెట్ గా చెబుతారు. అయితే తనకు తాను పొగడ్తలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయనను ట్రోల్ చేస్తుంటారు. పరిపాలనా విషయాలపై ఆయన బాగానే మాట్లాడతారు. బ్రదర్ అనిల్ నిజంగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెడితే మరో కేఏ పాల్ అవుతారు. ఆయన కమెడియన్ కేఏ పాల్ అయితే ఈయన సీరియస్ కేఏ పాల్ అవుతారు. ఈయన భీభత్సంగా వెయ్యి ఓట్లకు పైగా ఏమీ రావు. మహా అయితే నాలుగైదు నియోజకవర్గాల్లో పోటీ ఇచ్చే స్థాయికి వెళతారు. ఇది బ్రదర్ అనిల్ కు తెలియక కాదు. తెలుసు. అటువంటి విషయాలు తెలిసి రాజకీయ పార్టీగా దిగి డబ్బు ఖర్చు పెట్టుకోవాలని అని అనుకోరు. అన్న చెళ్లెళ్ల మధ్య గ్యాప్ ఉంది కాబట్టి, అన్నను దారిలోకి తెచ్చుకునేందుకు బ్రదర్ అనిల్ తో పార్టీ పెట్టిస్తే వైసీపీకి పడాల్సిన క్రీస్టియన్ ఓట్లు కొన్ని ఇటు చీలతాయి. రాష్ట్రంలో ఎస్సీ నియోజకవర్గాల్లో మాత్రమే కొంత ప్రభావం ఉండవచ్చు. అందుకే బ్రదర్ అనిల్ బావ జగన్ తన మాట వినాలనో, తనకు గుర్తించాలని వ్యూహం సిద్ధం చేసుకున్నారని అనుకోవచ్చు.

author avatar
Srinivas Manem

Related posts

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri