NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Budget 2021 : కోడలు..కోడలే..! కోడలు కూతురు కాలేదుగా..?

Budget 2021 : ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2021 కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వైద్య ఆరోగ్యశాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మరో అయిదు ప్రాధామ్యాలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన తొలుత జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో 2021-22 బడ్జెట్‌ను ఆమోదించారు. అనంతరం పార్లమెంట్ ‌లో విపక్షాల నిరసన మధ్య మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను చదివి వినిపించారు.

Budget 2021 : AP leaders dissatisfied with central budget
Budget 2021 AP leaders dissatisfied with central budget

అయితే బడ్జెట్‌ కేటాయింపులపై ఏపిలోని అధికార ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. కేంద్ర బడ్జెట్ చాలా నిరాశాజకంగా ఉందని అన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఏపిపై సవతితల్లి ప్రేమ చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన బడ్జెట్ ల కంటే చాలా చెత్తగా ఉందని అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్ఛేరి, కేరళ రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని అందరూ ఊహించారు. అందరి ఊహలకు అనుగుణంగానే మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంలో ఈ రాష్ట్రాలకు భారీగానే కేటాయింపులు జరిగాయి.

తమిళనాడు రాష్ట్రంలో దాదాపు 3500 కిలో మీటర్ల మేర రహదారుల నిర్మాణానికి ఏకంగా లక్ష కోట్ల రూపాయలు కేటాయించారు. మధురై – కొల్లమ్ కారిడార్, చిత్తూరు – తుత్పురు కారిడార్ ప్రాంతాల్లో ఈ రహదారుల నిర్మాణం జరగనున్నది. కేరళకు భారీగానే కేటాయింపులు జరిగాయి. దాదాపు 1100 కిలో మీటర్ల జాతీయ రహదారి నిర్మాణం కోసం 65వేల కోట్ల రూపాయలను కేటాయించారు. అదే విధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 6700 కిలో మీటర్ల మేర రహదారుల నిర్మాణానికి 25వేల కోట్ల రూపాయలను కేటాయించారు. అసోం రాష్ట్రంలో రహదారుల నిర్మాణంకు రూ.19వేల కోట్లు కేటాయించింది కేంద్రం. వీటిని దృష్టిలో పెట్టుకుని విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఇది ఎన్నికలు ఉన్న రాష్ట్రాల బడ్జెట్ లా ఉందని అన్నారు.

కేంద్రం తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపించిందని విమర్శించారు ఏపిసిసి అధ్యక్షుడు శైలజానాధ్. కేంద్ర బడ్జెట్ పేదలకు షాక్ ఇచ్చిందన్నారు. పెట్రోల్, డీజిల్ దరలు పెంచడం వల్ల రవాణాస, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయని ఆయన అన్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో ఏపిని విస్మరించడం బాధాకరమని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన కేంద్రం..తెలుగు రాష్ట్రాలను విస్మరించిందన్నారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తమిళుల ఆడపడుచు. తెలుగింటి కోడలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని కోడలు కోడలే..కోడలు కూతురు కాలేదుగా అని అంటున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk