NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Byreddy Rajasekhar Reddy: ఏపిలో నాయకుల వాడుతున్న భాషపై రాయలసీమ బీజేపీ నేత బైరెడ్డి హాట్ కామెంట్స్ ..!!

Byreddy Rajasekhar Reddy: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల నేతలు వాడుతున్న భాషాపదజాలంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో మంత్రి కొడాలి నాని వరకే పరిమితమైన ఆ భాషా సంస్కృతిని ఇప్పుడు చాలా మంది నాయకులు అందిపుచ్చుకున్నారు. వైసీపీ నేతలకే కాదు మాకు తిట్లు వచ్చు అన్నట్లుగా టీడీపీ నేతలు ఆ రీతిలోనే పద ప్రయోగం చేస్తున్నారు. ఇటీవల టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (పట్టాభి) చేసిన పదప్రయోగం బోస్డీకే తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజుల పాటు దీనిపైనే వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో  రాజకీయ నాయకుల సరళిపై   రాయలసీమ ప్రాంతానికి చెందిన బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి స్పందించారు. మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న భాషపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Byreddy Rajasekhar Reddy hot comments on tdp, ycp leaders
Byreddy Rajasekhar Reddy hot comments on tdp ycp leaders

Byreddy Rajasekhar Reddy: నేతల తిక్కతిక్క మాటలు ఆపాలి

కొంత మంది తిక్కతిక్క మాటలు మాట్లాడుతున్నారు. ఆయన ఎవరో మంత్రి కొడాలి నాని మాట్లాడే మాటలు  ఎంత అవమానకరంగా ఉంటున్నాయి, ఆ మాటలు మనం వినగలమా అని వ్యాఖ్యానించారు. దానికి తోడు తెలుగుదేశం కూడా తక్కువ లేదు, వారు కూడా అభ్యంతరకర రీతిలో మాట్లాడుతున్నారని బైరెడ్డి అన్నారు. ఇటీవల రాయలసీమ ప్రాంతానికి చెంది ఓ టీడీపీ ఎమ్మెల్యే సీమ ప్రాంతంలో ఉపయోగించే అన్ని తిట్లు ప్రయోగించాడని అన్నారు. అసెంబ్లీలో అర్ధవంతమైన చర్చ ఏమైనా జరుగుతుందా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఎన్ని సమస్యలు తీసుకురావాలి. అలా చేస్తున్నారా ? అసెంబ్లీలో చర్చల నుండి బహిరంగ సమావేశాల వరకూ ఎక్కడా రాజకీయ నేతల మాటల్లో హుందాతనం కనిపించడం లేదని బైరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

పిల్లల భవిష్యత్తు కోసం నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి

కొడాలి నానితో తనకు పరిచయం అయితే లేదు కానీ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నానన్నారు. ఆయనతో పాటు ఇతర పార్టీల నాయకులు అందరూ కూడా వారు వాడే భాష విషయంలో నోరు అదుపులో పెట్టుకోవాలని కోరారు. దీని వల్ల పిల్లలు చెడిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. బోస్ డికే అనే లాంటి మాటలు మాట్లాడటం వల్ల ఎంత మంది మీద ప్రభావం పడుతుందో నేతలు తెలుసుకోవాలన్నారు. “మీ తిట్లు చూసి పిల్లలు చెడిపోతార్రా నాయనా , ఒకాయన వచ్చి బోషడీకే అంటాడు… మరొకాయన వచ్చి బోషడికే అంటే అర్ధం ఇదీ అని వివరిస్తాడు. ఈయనేమన్నా తిట్లలో పండితుడా, తెలంగాణ భాష కానీ, రాయలసీమ భాష కానీ, కోస్తాంధ్ర భాష కానీ ఎంతో చక్కని భాషలు, కానీ కొత్త కొత్త భాషావేత్తలు పుట్టుకొస్తున్నారు, ఇది చాలా దురదృష్టకరం” అని బైరెడ్డి అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju