జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాయలసీమ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరెడ్డి ఫైర్ అయ్యారు. తనను ముసలోడు అని పవన్ అన్నారనీ, తాను కొండారెడ్డి బురుజు వద్ద పవన్ తో కుస్తీకి రెడి అంటూ బైరెడ్డి సవాల్ విసిరారు. రాయలసీమ ఉద్యమకారులను పవన్ అవమానించారని అన్నారు. సీమ సెంటిమెంట్ పవన్ కు ఏమి తెలుసునని ప్రశ్నించారు. సీమను రెండుగా చేయాలని చూస్తే ఇబ్బంది పడతావంటూ అన్నారు. పవన్ కళ్యాణ్ నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు బైరెడ్డి.

రాష్ట్రంలో విభజన వాదంపై పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపిలో వేర్పాటు వాద రాజకీయాలు చేస్తే సహించమని అన్నారు. పబ్లిక్ పాలసీని తెలియని మీరు రాష్ట్రాలను విడదీస్తామంటే తోలుతీసి కూర్చోబెడతా, తమాషాగా ఉందా అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశారు. మా నేల అంటున్నారనీ, ఇది మాదేశం కాదా అని, రాయలసీమ గురించి మాట్లాడుతున్నారనీ, అక్కడి నుండి ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారనీ, కర్నూలు నుండి రాజధాన పోతుంటే ఎందుకు కాపాడుకోలేకపోయారని పవన్ ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర రాష్ట్రం కోరుతున్న వారికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఇతర ప్రాంతాల వారు చనిపోయిన విషయం తెలుసా అని పవన్ ప్రశ్నించారు. ఇలా పవన్ చేసిన వ్యాఖ్యలపై బైరెడ్డి స్పందించారు.
రాజకీయాల్లో విమర్శలు, విమర్శలు చేసుకోవడం సహజం, అదే విధంగా ఆరోపణలకు ప్రత్యారోపణలు చేసుకుంటారు. కానీ ఇటీవల కాలంలో రాజకీయ నాయకుల మధ్య సినిమా డైలాగ్ లు పేలుతున్నాయి. తేల్చుకుందాం రా అంటే తేల్చుకుందాం రా అంటూ సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే క్రమంలో బైరెడ్డి .. పవన్ ను ఉద్దేశించి కుస్తీకి సవాల్ విసరడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
బాలకృష్ణకు తృటిలో తప్పిన ప్రమాదం .. అభిమానులకు అభివాదం చేస్తూ..వీడియో వైరల్