NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ టెక్నాలజీ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

careplex vitals app: పల్స్ ఆక్సీమీటర్ అక్కర్లేదు..! ఇక స్మార్ట్ ఫోన్‌లోనే ఆక్సిజన్ లెవల్స్ చూసుకోవచ్చు..! అదెలానో చూడండి..!!

careplex vitals app:  దేశంలో కరోనా రెండవ దశ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. మొదటి దశతో పోల్చుకుంటే రెండవ దశలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. వ్యాధి తీవ్రత అధికంగా ఉంది. గత ఏడాది కరోనా ఫస్ట్ ఫేస్ లో ఆక్సిజన్ ఇబ్బందులు తలెత్తలేదు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది కరోనా బాధితులకు ఆక్సిజన్ అవసరం అవుతోంది. ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో కరోనా బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలు తెలిపే ఆక్సీమీటర్ల, స్మార్ట్ వాచ్ లకు ఒక్క సారిగా డిమాండ్ పెరిగింది. గతంలో 400 – 500 లకు విక్రయించిన పల్స్ ఆక్సిమీటర్ ధరలు ఆమాంతం పెరిగిపోయాయి. రూ.2వేలు, 2500ల వరకూ ధరలు పెరిగిపోయాయి. ఇంత ధర పెట్టి ఆక్సిమీటర్ కొనుగోలు చేసుకునే బదులు స్మార్ట్ ఫోన్ లోనే యాప్ ద్వారా ఆక్సిజన్ లెవల్స్, పల్స్, శ్వాసక్రియల రేట్లు తెలుసుకుంటే బాగుంది కదా అన్న ఆలోచన కోల్‌కతాకు చెందిన కేర్ నౌ హెల్త్ కేర్ అనే అంకుర సంస్థ ప్రతినిధికి వచ్చింది. ఆ ఆలోచనలకు అనుగుణంగా ఈ సంస్థ “కేర్ ఫ్లిక్స్ వైటల్స్ యాప్” ను రూపకల్పన చేసింది.

careplex vitals app:
careplex vitals app

ఫోటో ప్లెథిస్మాగ్రఫీ టెక్నాలజీతో, కృత్రిమ మేథ సాయంతో కేర్ ప్లిక్స్ వైటల్స్ యాప్ పని చేస్తుంది. సాధారణంగా ఆక్సీమీటర్లలో ఇన్ ఫ్రారెడ్ లైట్ సెన్సార్లు ఉంటాయి. కానీ ఈ యాప్ లో కేవలం మన ఫోన్ లోని ఫ్లాష్ ఆధారంగా ఆక్సిజన్ స్థాయి తెలుసుకోవచ్చు. ఈ యాప్ ను తెరిచి మన ఫోన్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి వెనుక కెమెరా పై మన వేలిని ఉంచాలి. తర్వాత స్కాన్ అనే బటన్ నొక్కగానే నలభై సెకన్లలో ఆక్సిజన్, పల్స్, శ్వాసక్రియ రేట్లన యాప్ లో చూపిస్తుందని హెల్త్ కేర్ సహా వ్యవస్థాపకుడు శుభబ్రాతా పాల్ తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలోనే దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని ఆయన చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ ద్వారా ఈ యాప్ 96 శాతం సమర్థవంతంగా పని  చేస్తున్నట్లు నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు.

careplex vitals app: ఈ యాప్ ను ఇలా డౌన్ లోడ్ చేసుకోవాలి

ఈ యాప్ ప్రస్తుతం ఐవోఎస్ వినియోగదారుల కోసం యాప్ స్టోర్ లో అందుబాటులో ఉంది. అండ్రాయిడ్ యూజర్ల కోసం అయితే వెబ్ సైట్ లో ఏపికేను అందుబాటులోకి ఇచ్చారు. త్వరలో ప్లేస్టోర్ లోకి తీసుకురానున్నారని సమాచారం. సింగిల్ యూజర్ వినియోగదారుల కోసం ఉచితంగా అందిస్తున్నారు. అంతకు మించి సేవలు కావాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఆ వివరాలు కేర్ నౌ వెబ్ సైట్ లో చూడవచ్చు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!