NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chandrababu lokesh: చంద్రబాబు, లోకేష్ లపై కల్యాణదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు.. నెక్స్ట్ రౌడీ షీటేగా ఓపెన్ చేసేయండి..!

Chandrababu lokesh: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లపై కేసు నమోదు అయ్యింది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పోలీస్ స్టేషన్ లో వీరిద్దరిపై కేసులు నమోదు అయ్యాయి. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు కారణంగా వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మేటర్ ఏమిటంటే.. ఇటీవల మంత్రి ఉషాశ్రీ చరణ్ పర్యటన నేపథ్యంలో ఆసుపత్రికి వెళుతున్న చిన్నారి ట్రాఫిక్ లో చిక్కుకుని మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై చంద్రబాబు, లోకేష్ లు పోలీస్ బందోబస్తు చర్యలను తప్పుబడుతూ ట్రాఫిక్ ఇబ్బందుల వల్లనే చిన్నారి మృతి చెందింది అంటూ వారి ట్విట్టర్ ఖాతాలో కామెంట్స్ చేస్తూ పోస్టు పెట్టారు. అయితే చిన్నారి మృతి పై చంద్రబాబు, లోకేష్ లు అసత్యాలతో కూడిన పోస్టులు పెట్టారంటూ కల్యాణదుర్గం రూరల్ మండల వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ కొంగర భాస్కర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఈ పిర్యాదును పురస్కరించుకుని చంద్రబాబు, లోకేష్ లపై ఐపీసీ సెక్షన్ 153 (ఏ), రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేశారు.

Case Filed against Chandrababu lokesh in kalyanadurgam PS
Case Filed against Chandrababu lokesh in kalyanadurgam PS

Chandrababu lokesh: ‘రౌడీ షీట్ ఓపెన్ చేస్తావా..? దేనికైనా రెడీ’

ఈ కేసు నమోదుపై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. ఇంత పిరికివాడివేంటి జగన్ అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కేసు పెడతానంటే.. ప్రశ్నిస్తూనే ఉంటానని పేర్కొన్నారు. హత్యాయత్నంతో పాటు 11 కేసులు పెట్టారు. ఇప్పుడు కల్యాణదుర్గంలో మరో కేసు పెట్టారన్నారు. ప్రజల పక్షాన నిలబడినందుకు మాత్రమే తనపై కేసులు ఉన్నాయన్నారు. మంత్రి పర్యటన సందర్భంగా ఓవర్ యాక్షన్ చేసి దళిత చిన్నారిని బలిగొన్నారని ఆరోపించారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయ్యమని అడిగిన తనపై కేసు పెట్టారని అన్నారు లోకేష్, ‘బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడినందుకు 12 కేసులు పెట్టావ్.. నెక్స్ట్ ఏంటీ ..? రౌడీ షీట్ ఓపెన్ చేస్తావా..? దేనికైనా రెడీ’ అంటూ లోకేష్ పోస్టు చేశారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju