Ashok Gajapathi Raju: అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు..! ఎందుకంటే..?

Share

Ashok Gajapathi Raju: మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై విజయనగరం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. మాన్సాస్ ట్రస్ ఉద్యోగులకు కార్యనిర్వహణ అధికారి (ఇఓ) జీతాలు నిలుపుదల చేయడంపై ఇటీవల ఉద్యోగులు ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజును కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఆ తరువాత వీరు ట్రస్ట్ కార్యాలయం వద్దకు వెళ్లి జీతాలు నిలుపుదల చేయడంపై ధర్నా నిర్వహించి ఇఓను నిలదీశారు. ఈ క్రమంలో ఇఓ, ఉద్యోగుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఇఓ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ట్రస్ట్ ఉద్యోగులు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనీ, ఇఓ పై దాడికి ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు  ప్రేరేపించారనే అభియోగంపై కేసు నమోదు చేశారు. ట్రస్ట్ చైర్మన్, కరస్పాండెంట్ సహా పది మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Case filed against to Ashok Gajapathi Raju
Case filed against to Ashok Gajapathi Raju

తమ ఇబ్బందులను తెలియజేయడానికి వెళితే చైర్మన్ తో పాటు తమపైనా కేసు పెట్టడం ఏమిటని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ చేసే కార్యక్రమాలకు లేని కోవిడ్ నిబంధనలు ఆకలితో అలమటించే తమకు వర్తింపజేయడం పట్ల ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.


Share

Related posts

మౌనం మాట్లాడింది… మోడీకి మన్మోహన్ హితవు!

CMR

శభాష్ జగన్ అంటున్న కమల్ హాసన్..!!

sekhar

West bengal Elections : బీహార్ ఫార్ములాతోనే బెంగాల్ బరిలో బీజేపీ..! ముస్లిం ఓట్ల కోసం ఎత్తులు – కత్తులు..!?

Srinivas Manem