Casino: సంక్రాంతి పండగ ముగిసింది. కోళ్ల పందాలూ ముగిసాయి. ఇదే సమయంలో గుడివాడలో మంత్రి కొడాలి నాని ఇలాకాలో జరిగిన ‘క్యాసినో’ గేమింగ్ పొలిటికల్ గా ప్రకంపనలు రేపుతోంది. కె-కన్వెన్షన్ లో జరిగిన క్యాసినో ద్వారా వందల కోట్లు పందాలు జరిగాయని.. రాష్ట్రంలో జూదం కల్చర్ తీసుకొచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గోవా నుంచి ప్రత్యేకంగా ఓ క్లబ్ ను తీసుకొచ్చి, బౌన్సర్లను పెట్టి మరీ మంత్రి జూదం నిర్వహించారని ఆరోపణలు చేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేయడం.. కృష్ణా జిల్లా ఎస్పీ స్పందించి దీనిపై డీఎస్పీ స్థాయిలో విచారణకు ఆదేశించడం కూడా జరిగింది. అయినా.. రాజకీయ ప్రత్యారోపణలు ఆగడం లేదు. ప్రభుత్వానికి తెలీకుండా క్యాసినో జరిగే అవకాశం లేదని కూడా ఆరోపిస్తున్నారు.

టీడీపీ ఆరోపణలు..
సంక్రాంతి పండగ మన పల్లెల్లో ఎంతో సంబరంగా సంప్రదాయరీతిలో జరుగుతుంది. కోళ్ల పందాలపై ప్రతిఏటా పంచాయతీలు జరుగుతాయి. అయినా.. భారీ సెట్టింగ్స్ మధ్య జరగుతాయి. వీటితోపాటు అనేక పందాలు జరుగుతాయి. (Casino) క్యాసినో తరహా గేమింగ్ ఇంతవరకూ జరగలేదనే చెప్పాలి. అయితే.. ఇది సాక్షాత్తూ మంత్రి సొంత కన్వెన్షన్ సెంటర్లో జరగడమే ఇంతటి సంచలనానికి నాంది పలికింది. అసలే.. టీడీపీపై మంత్రి కొడాలి నాని ఓ రేంజ్ లో విరుచుకుపడతూ ఉంటారు. ఇప్పుడు టీడీపీ నాయకులకు అవకాశం దొరికింది. కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బాధ్యతాయుతమైన మంత్రి హోదాలో జూదం నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ క్యాసినో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్ గా మారింది.
నాని క్లారిటీ ఇస్తారా..
దీనిపై మంత్రి కురసాల కన్నబాబు స్పందిస్తూ.. టీడీపీపై విమర్శలు చేశారు. టీడీపీ హయాంలో కోళ్ల పందాలు జరిగితే.. సంక్రాంతి సంబరాలు అని, తమ హయాంలో జరుగుతుంటే.. జూద క్రీడలు అంటారని కామెంట్ చేశారు. నాని కరోనాతో చికిత్సలో ఉంటే ఆయనపై నిందలు వేయడం తగదన్నారు. విదేశాల్లో, ఇండియాలో గోవాలో కనిపించే (Casino) క్యాసినో గేమింగ్ ఒక్కసారిగా లోకల్ కి వచ్చేసరికి విపరీతమైన ఫోకస్ వచ్చేసింది. అసలే పండగ కావడంతో జనాల సందడీ ఎక్కువైంది. ప్రస్తుతం దీనిపై స్పందించేందుకు మంత్రి కొడాలి అందుబాటులో లేరు. ఆయన వచ్చాకైనా ‘క్యాసినో’ పాలిటిక్స్ కు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి..!