YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య స్థలంలో లభ్యమైన లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్షకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ టెస్ట్ తో లేఖపై ఉన్న వేలిముద్రలను గుర్తించనున్నారు. వివేకా లేఖపై వేలిముద్రలు గుర్తింపునకు నిన్ హైడ్రిన్ పరీక్ష నిర్వహించనున్నారు. నిన్ హైడ్రిన్ పరీక్షకు అనుమతి ఇవ్వవద్దని నిందితులు పేర్కొన్నారు. అయితే ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి మాత్రం నిన్ హైడ్రిన్ పరీక్షలకు అభ్యంతరం లేదని కోర్టుకు తెలిపారు.

వివేకా హత్య స్థలంలో లభ్యమైన లేఖను అధికారులకు ఆలస్యంగా ఇచ్చారనీ, ఆ లేఖను సీబీఐ అధికారులు పరిగణలోకి తీసుకోలేదంటూ వైఎస్ అవినాష్ రెడ్డి గతంలో ఆరోపించారు. అయితే ఆ లేఖను అధికారులు ఫొరెన్సిక్ పరీక్షలకు గతంలోనే పంపగా, లేఖను ఒత్తిడిలో వివేకానే రాసినట్లు సీఎఫ్ఎస్ఎల్ నివేదిక లు తేల్చాయి. దీంతో లేఖపై ఉన్న వేలి ముద్రలు గుర్తించాలని సీబీఐ నిర్ణయానికి వచ్చింది. దీనిపై కోర్టు అనుమతి కోరగా, ముందుగా నిందితులకు నోటీసులు ఇచ్చి వారి అభిప్రాయాలను న్యాయస్థానం తీసుకున్నది. ఈ అంశంలో సీబీఐ వాదనలకు కోర్టు సమ్మతించింది.
ముంద స్తు ఎన్నికల ఊహాగానాలపై సీఎం జగన్ ఇచ్చిన క్లారిటీ ఇది