YS Viveka Case: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు వైఎస్ భాస్కరరెడ్డికి ఎస్కార్ట్ బెయిల్ మళ్లీ పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన ఎస్కార్ట్ బెయిల్ ను నవంబర్ 10 వరకూ పొడిగించింది. అయితే ఈ సందర్భంలోనే సీబీఐ అభ్యంతరాల నేపథ్యంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్కార్ట్ బెయిల్ మరో రెండు నెలలు పొడిగించాలని కోరుతూ భాస్కరరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైదరాబాద్ సీబీఐ కోర్టు లో విచారణ జరిగింది.

వైద్యులు లేకపోవడంతో అక్టోబర్ 18న చికిత్స జరగలేదని ఆయన తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ పిటిషన్ విచారణ సమయంలో సీబీఐ అభ్యంతరాలు తెలిపింది. ఎస్కార్ట్ బెయిల్ పొడిగింపునకు ఏదో ఒక కారణం చూపుతున్నారని సీబీఐ అభ్యంతరం తెలిపింది. దీంతో భాస్కరరెడ్డి ఆరోగ్యంపై వాస్తవాలు తేల్చేందుకు ఇద్దరు వైద్యులతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని డీఎంఈకి సీబీఐ కోర్టు ఆదేశించింది. ఎస్కార్ బెయిల్ ను నవంబర్ పదవ తేదీ వరకూ పొడిగిస్తూ, పిటిషన్ పై తదుపరి విచారణ నవంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది.
వైఎస్ భాస్కరరెడ్డికి సీబీఐ కోర్టు ఆరోగ్య కారణాల రీత్యా పోలీస్ బందోబస్తుతో సెప్టెంబర్ 20వ తేదీన తొలుత 12 రోజులు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎస్కార్ట్ బెయిల్ పై చంచల్ గూడ జైల్ నుండి బయటకు వచ్చిన తర్వాత భాస్కరరెడ్డి కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత వైద్యులు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారనీ, చికిత్స కొనసాగుతున్నందున ఎస్కార్ బెయిల్ బెయిల్ పొడిగించాలని సీబీఐ కోర్టులో మరో రెండు సార్లు పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ జరిపిన సీబీఐ కోర్టు ..మధ్యంతర బెయిల్ పొడిగిస్తూ వచ్చింది. దీంతో సీబీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
Chandrababu: టీడీపీ సంబరాలపై సజ్జల స్పందన ఇలా .. ‘చికిత్స తర్వాత బాబు జైలుకెళ్లాల్సిందే’