NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Viveka Case: సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కరరెడ్డికి మరోసారి ఊరట.. ఎస్కార్ట్ బెయిల్ పొడిగింపు

CBI Notices to ys bhaskar reddy once again in viveka murder case
Share

YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన వైఎస్ భాస్కరరెడ్డి సీబీఐ కోర్టులో మరో సారి ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్ పై ఇవేళ విచారణ జరిగింది. ఎస్కార్ట్ బెయిల్ పొడిగించాలని కోరుతూ ఆయిన సీబీఐ కోర్టును కోరారు. అనారోగ్య కారణాలతో ఇటీవల సీబీఐ కోర్టు ఆయనకు 12 రోజులు ఎస్కార్ట్ బెయిల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఎస్కార్ట్ బెయిల్ గడువు ఈ నెల 3వ తేదీన ముగుస్తున్న నేపథ్యంలో అనారోగ్య కారణాలతో బెయిల్ పొడిగింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన సీబీఐ కోర్టు ఈ నెల పదవ తేదీ వరకూ ఎస్కార్ట్ బెయిల్ ను పొడిగించింది. ఈ మేరకు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

CBI Notices to ys bhaskar reddy once again in viveka murder case
ys bhaskar reddy

వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ నిందితుడుగా చేర్చిన సంగతి తెలిసిందే. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన బయటే ఉన్నారు. వైఎస్ భాస్కరరెడ్డిని మాత్రం సీబీఐ అరెస్టు చేసి చంచల్ గూడ జైల్ కు తరలించింది. ఆయన పలు పర్యయాలు దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు, తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఇటీవల తన ఆరోగ్య సమస్య కారణంగా మద్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేయగా, సీబీఐ అధికారులు వ్యతిరేకించారు.

అయితే జైల్ అధికారులు ఇచ్చిన నివేదక ఆధారంగా సీబీఐ కోర్టు న్యాయమూర్తి  ఆయనకు 12 రోజులు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేశారు. ఈ సమయంలో హైదరాబాద్ వదిలివెళ్లడానికి వీలులేదని న్యాయస్థానం  షరతు విధించింది. అయితే పరీక్షలు, చికిత్స పూర్తి కాకపోవడంతో బెయిల్ ను పొడిగించాలని భాస్కరరెడ్డి సీబీఐ కోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన కోర్టు ఈ నెల 10వ తేదీ వరకూ బెయిల్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 10న సాయంత్రం 5 గంటలకు చంచల్ గూడ జైలు సూపర్నిటెండెంట్ ముందు లొంగిపోవాలని భాస్కరరెడ్డిని కోర్టు ఆదేశించింది.

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ నివాసంలో ఈడీ సోదాలు


Share

Related posts

Cyclone Alert: తుఫానుగా మారిన అల్పపీడనం .. ‘హమూన్’ గా నామకరణం

somaraju sharma

విశాఖ లో హైటెన్షన్ .. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర జేఏసీ నిరసన

somaraju sharma

Vijay Sethupathi: బాలీవుడ్ ని షేక్ చేస్తున్న విజయ్ సేతుపతి!!

Naina