YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ మరో సారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీ (రేపు) హైదరాబాద్ లో విచారణకు రావాలంటూ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హజరు కావాలని సీబీఐ కోరింది. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి అనుమానితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనను సీబీఐ ఇప్పటికే పలు మార్లు విచారించింది.

ఇప్పటికే ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ అరెస్టు చేయగా, చంచల్ గూడ జైలులో ఉన్నారు. అరెస్టు భయంలో అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, ఏప్రిల్ 25 వరకూ అరెస్టు చేయవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టు రద్దు చేసింది. తదుపరి తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. హైదరాబాద్ నుండి ఇవేళ కడపకు వచ్చిన అవినాష్ రెడ్డి.. నోటీసుల నేపథ్యంలో తిరిగి హైదరాబాద్ కు బయలుదేరారు. మరో పక్క వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టేసింది.
DK Sivakumar: డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు .. పార్టీ అధిష్టానం నుండి పిలుపు