మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డికి సీబీఐ మరో సారి నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేసింది సీబీఐ. పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లి ఇంట్లో నోటీసులు అందజేశారు. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హోస్ నందు ఈ నెల 12వ తేదీన విచారణకు హజరుకావాలని నోటీసులో పేర్కొంది సీబీఐ. గత నెలలో ఒక పర్యాయం భాస్కరరెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేయగా, ముందస్తు కార్యక్రమాలలో పాల్గొనాల్సిన ఉన్నందున విచారణకు హజరు కాలేకపోతున్నట్లు భాస్కరరెడ్డి సీబీఐకి సమాచారం ఇచ్చారు. ఇప్పటికే భాస్కరరెడ్డి తనయుడు ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు రెండు సార్లు విచారణ జరిపారు. రెండవ సారి విచారణ తర్వాత అవినాష్ రెడ్డి.. సీబీఐ విచారణ తీరుపై సక్రమంగా జరగడం లేదని ఆక్షేపించారు. వ్యక్తి టార్గెట్ గా దర్యాప్తు కొనసాగుతోందని ఆరోపించారు.

అవినాష్ రెడ్డి ఫోన్ కాల్ డేటా ఆధారంగా సీఎం ఒఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతి పీఏ నవీన్ లను సీబీఐ అధికారులు కడపకు పిలిపించి విచారించారు. ఈ క్రమంలో అవినాష్, ఇతరులు ఇచ్చిన సమాచారం అధారంగా భాస్కరరరెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది. వివేకా హత్య గురించి ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి, ఆయన సోదరుడులకు ముందే తెలుసునని సీబీఐ పిటిషన్ లో కోర్టుకు తెలిపింది. భాస్కరరెడ్డిని గతంలోనూ ఒక పర్యాయం విచారణ చేసినట్లు సమాచారం. తాజా పరిణామాలను చూస్తుంటే వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచినట్లుగా కనబడుతోంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు వివేకా హత్య కేసు ఏపి నుండి తెలంగాణకు బదిలీ అయిన తర్వాత .. సీబీఐ కోర్టులో ట్రయిల్ కూడా ప్రారంభం అయ్యింది. ఈ కేసులో అరెస్టు అయి కడప సెంట్రల్ జైలులో ఉన్న నిందితులను సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ చంచల్ గూడ జైలుకు తరలించారు.
చైతన్య కళాశాలలో విద్యార్ధి ఆత్మహత్య .. యాజమాన్యంపై కేసు నమోదు .. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం