NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Case: కర్నూలులో హైటెన్ష్ .. అవినాష్ రెడ్డి కోసం కర్నూలు చేరుకున్న సీబీఐ అధికారుల బృందం

Share

YS Viveka Case: కర్నూలులో హైటెన్ష్ వాతావరణం నెలకొంది. వివేకా హత్య కేసులో విచారణకు హజరు కావాల్సిన కడప ఎంపి అవినాష్ రెడ్డి వివిధ కారణాలు చెబుతూ గైర్హజరు అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 16వ తేదీన విచారణకు హజరు కావాల్సి ఉండగా, ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల హజరు కాలేకపోతున్నానంటూ చివరి నిమిషంలో సమాచారం ఇచ్చి గైర్హజరు అయ్యారు. ఆ తర్వాత 19వ తేదీ విచారణకు రావాలని సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు.

YS Avinash Reddy

 

ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్కడ నుండి ఎటువంటి ఉపశమన ఆదేశాలు రాలేదు. ఈ నేపథ్యంలో 19వ తేదీ విచారణకు హజరు కావాల్సి ఉండగా, చివరి నిమిషంలో తన తల్లి ఆరోగ్యం బాగోలేదంటూ సమాచారం ఇచ్చి హైదరాబాద్ నుండి పులివెందుల బయలుదేరారు అవినాష్ రెడ్డి. ఈ నేపథ్యంలో సిబీఐ అధికారులు ఆయనను అనుసరించారు. చివరకు అవినాష్ రెడ్డి మార్గమధ్యలో తన తల్లి వచ్చిన అంబులెన్స్ తో కర్నూలుకు వెళ్లి  విశ్వభారతి ఆసుపత్రికి చేరుకున్నారు. తన తల్లి లక్ష్మమ్మకు అక్కడ వైద్య చికిత్సలు అందిస్తున్నారు. దీంతో సీబీఐ అధికారులు కర్నూలు నుండి వెనుతిరిగారు. ఆ సాయంత్రమే 22వ తేదీ విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. దీనికి అవినాష్ రెడ్డి సమ్మతి తెలియజేశారు.

అయితే నిన్న అవినాష్ రెడ్డి సీబీఐకి మరో లేఖ రాశారు. తన తల్లి ఆరోగ్యం బాగోలేదనీ, మరో పది రోజులు సమయం కావాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి లేఖకు సిబీఐ స్పందించకుండానే సోమవారం వేకువజామున అధికారులు విశ్వభారతి ఆసుపత్రికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీబీఐ అధికారులను అడ్డుకునేందుకు ఆసుపత్రి గేటు వద్ద వైసీపీ శ్రేణులు మోహరించారు. అధికారుల వాహనాలను అడ్డుకునేందుకు ఆటంకాలు సృష్టించారు. పోలీసులు వారందరినీ వెనక్కి పంపుతున్నారు.

ముందుగా సీబీఐ అధికారులు జిల్లా ఎస్పీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తొంది.  అయితే ఈ రోజు సీబీఐ అధికారులు మరో సారి నోటీసులు ఇచ్చి వెళతారా లేక అదుపులోకి తీసుకుంటారా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మూడు సార్లుగా విచారణకు గైర్హజరు కావడంపై సీబీఐ అధికారులు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తొంది. ఇవేళ సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినబడుతున్నాయి. ఈ అంశంపై మరి కొద్ది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరో పక్క విశ్వభారతి ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

Papua New Guinea: భారత ప్రధాని నరేంద్ర మోడీకి పాదాభివందనం చేసి మరీ స్వాగతించిన ఆ దేశ ప్రధాని


Share

Related posts

Panchayat Polls : గ్రామ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ కు సర్వం సిద్ధం

somaraju sharma

YS Viveka: ఆ పెద్ద అరెస్టుకి ఒక్క అడుగు దూరం..! వివేకా హత్య కేసులో ఇదే కీలకం..!?

Srinivas Manem

చిరు ‘సామ్ జామ్’ టాక్ షో హైలెట్స్…!

siddhu