Breaking: ఇవేళ విచారణకు హజరు కాకుండా సీబీఐకి కడప ఎంపి అవినాష్ రెడ్డి ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హజరు కాకుండా హైదరాబాద్ నుండి కడప బయలుదేశారు. ఇవేళ 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో విచారణకు అవినాష్ రెడ్డి హజరు కావాల్సి ఉంది. అయితే ఆయన సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ముందస్తు షెడ్యుల్ కార్యక్రమాల కారణంగా విచారణకు హజరు కాలేకపోతున్నాననీ, ముడు నాలుగు రోజులు గడువు కావాలంటూ సీబీఐకి లేఖ రాశారు.

ఈ లేఖపై సీబీఐ అధికారులు స్పందించినట్లుగా తెలుస్తొంది. అవినాష్ రెడ్డిని విజ్ఞప్తిని సీబీఐ తోసిపుచ్చినట్లుగా తొలుత వార్తలు వచ్చాయి. ఇవేళే విచారణకు రావాల్సిందేనని సమాచారం ఇచ్చారని ప్రచారం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల తరువాత సీబీఐ అవినాష్ రెడ్డి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించింది. ఈ నెల 19వ తేదీన విచారణకు హజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఒక వేళ అవినాష్ రెడ్డి విచారణకు హజరు కాకపోతే సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు అందజేసి సీబీఐ అధికారులు అదుపులోకి విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
మరో పక్క కోటి లోని సీబీఐ కార్యాలయం వద్ద అవినాష్ రెడ్డి విచారణ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి కేవలం సీబీఐ కార్యాలయంలో విధులు నిర్వహించే వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. బయట వ్యక్తులను లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదు. అవినాష్ రెడ్డి వాహనం తప్ప మరే ఇతర వాహనాలను అనుమతి లేకుండా చర్యలు చేపట్టారు. అవినాష్ రెడ్డి ని విచారించేందుకు సీబీఐ టీమ్ కార్యాలయంలో సిద్దమైంది. విచారణ కోసం ఢిల్లీ నుండి నిన్న సాయంత్రమే సీబీఐ టీమ్ హైదరాబాద్ కు చేరుకుంది. అయితే అవినాష్ రెడ్డి విజ్ఞప్తి పై విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది సీబీఐ.