ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్రంలోని ప్రధాన సమస్యలపై వినతులు సమర్పిస్తూ ఉన్నారు. ఈ వినతుల్లో ఏపికి ప్రత్యేక హోదా ప్రస్థావన తెస్తూనే ఉన్నారు. బీజేపీ పెద్దలు మాత్రం చాలా కాలం నుండి ఏపికి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయని చెబుతున్నా సీఎం జగన్మోహనరెడ్డి .. ప్రత్యేక హోదా అడుగుతూనే ఉన్నారు. తాజాగా ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం మరో సారి క్లారిటీ ఇచ్చింది. ఏపికి ప్రత్యేక హోదా లేనట్లేననీ, ముగిసిన అధ్యాయమని మరో సారి పార్లమెంట్ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసింది.

మంగళవారం లోక్ సభలో వైసీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, బాల శౌరిలు అడిగిన ప్రశ్నకు కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్ధిక లోటు భర్తీకి 14వ ఆర్ధిక సంఘం నిధులు కేటాయించిందన్నారు. దీంతో ప్రత్యేక, ఇతర రాష్ట్రాలకు మధ్య తేడా లేకుండా పోయిందన్నారు. హోదాకు బదులుగా ఏపికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించామని, ప్యాకేజీ కింద రూ.15.81 కోట్ల నిధులు విడుదల చేశామని నిత్యానంద రాయ్ తెలిపారు.
సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఇంత దిగజారుడా..! తప్పుడు ప్రచారంపై కోటా శ్రీనివాసరావు ఫైర్