central budget : కబుర్లు చెప్పడంలో మీ తరవాతనే బాసూ..తెలుగోళ్ళకి సూపర్ దెబ్బ కొట్టిన కేంద్ర మంత్రి

Share

central budget : కేంద్ర బడ్జెట్ లో ఏపికి కేటాయింపులు లేకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ లో ఏపికి ప్రాధాన్యత లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికార పార్టీ ఎంపీలు కేంద్రం ఏపికి మొండి చేయి ఇచ్చిందంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు, బీజెపీ పెద్దలు బడ్జెట్ పై అవగాహన కల్పిస్తున్నారు. బీజెపీ నేతలు వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా కేంద్ర బడ్జెట్ పై అవగాహన సదస్సులో పాల్గొన్న కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ తెలుగు ప్రజల పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు.

central budget : central minister comments telugu people
central budget : central minister comments telugu people

తెలుగు ప్రజలను మునగచెట్టు ఎక్కించారు ఆయన. తెలుగు మాట్లాడే వారు ప్రపంచంలో ఎక్కడ పని చేసినా నిస్వార్థంగా పని చేయడం చూశానంటూ ఓ కితాబు పడేశారు. తెలుగు ప్రజల వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించి కేంద్ర బడ్డెట్ ప్రాధాన్యతను వివరించారు. కరోనా మహామ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని పేర్కొన్న ఆయన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు దోహదపడుతుందన్నారు. కేంద్ర బడ్జెట్ ను రాష్ట్ర స్థాయిలో చూడకూడదంటూ సెలవు ఇచ్చారు కేంద్ర మంత్రి సారువారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అభివృద్ధి జరిగేలా బడ్జెట్ రూపొందించిందని ఆయన అన్నారు.

ఆత్మనిర్భర్ భారత్ బడ్జెట్ లో ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో ఎంతో మందికి జీవనోపాధి దొరుకుతుందని అన్నారు కేంద్ర మంత్రి. ఆరోగ్య భారత్, ప్రజలు ఆరోగ్యంగా ఉన్న దేశమే వేగంగా అభివృద్ధి చెందుతుందనీ అందుకే బడ్జెట్ లో ఆరోగ్యానికి పెద్ద పీట వేయడం జరిగిందన్నారు. కరోనా వ్యాక్సిన్ తో ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందనీ, అనేక దేశాలకు భారత్ నుండి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న 14 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో కేటాయింపులు చేసిందని, దీని వల్ల రూ.1.14 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూరనుందని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనను ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి జయశంకర్ గుర్తు చేశారు.


Share

Related posts

అదరగొడుతున్న పియాజియో కొత్త స్కూటర్.. ఫీచర్స్ చేసేయండి..

bharani jella

ఆ వివాదంలో వేలెట్టిన టిడిపి ఎంపీ ! ఆయనా ఆ సామాజిక వర్గీయుడే !!

Yandamuri

YSR Pelli Kanuka: వైఎస్ఆర్ పెళ్లి కానుకకు జగనన్న మంగళం పాడినట్లేనా..?

somaraju sharma