Free Ration Distribution: కేంద్ర ప్రభుత్వ ఉచిత రేషన్‌ ఇక లేనట్లే..? కేంద్ర మంత్రుల ప్రకటనలు నీటి మీద రాతలేనా..!?

Share

Free Ration Distribution: ఉచిత రేషన్ స్కీమ్‌ను మరి కొంత కాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా అందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల కాలేదు. కరోనా నేపథ్యంలో రేషన్ కార్డుదారులకు గత నెల (నవంబర్) వరకూ రేషన్ షాపుల ద్వారా ఉచిత బియ్యాన్ని పంపిణీ చేశారు. అయితే ఈ ఉచిత రేషన్ ను మార్చి 2022 వరకూ పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గత నెలలో వెల్లడించారు. అయితే డిసెంబర్ కోటా పంపిణీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి ఇంత వరకూ ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు. పీఎంజీకేఏవై పొడిగించిన అయిదవ విడత అలకేషన్ ఉత్తర్వులు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధంలో ఉంది. ఈ నెలలో పీఎంజీకేఏవై బియ్యం పంపిణీ ఉందా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

 

Read More: YSRCP: పార్లమెంట్ వేదికగా కథ చెప్పి.. జగన్ సలహాదారుల గాలి భలే తీశారుగా ఎంపి మిథున్ రెడ్డి..!!

Free Ration Distribution: పీఏంజీకేవై రేషన్ లేనట్లే..?

ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ ను డోర్ డెలివరీ వాహనాల ద్వారా ఒకటవ తేదీ నుండి 16,17 తేదీ వరకూ పంపిణీ జరుగుతుంది. 18,19 తేదీల నుండి ప్రధాన మంత్రి ఉచిత బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా నేరుగా కార్డుదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే 16వ తేదీ వచ్చినా ఇంత వరకూ కేంద్ర ప్రభుత్వం నుండి పీఏంజీకేవై రేషన్ కు సంబంధించి ఉత్తర్వులు రాకపోవడంతో పంపిణీ లేనట్లుగానే భావిస్తున్నారు. ఎందుకంటే గత ఏడాది నవంబర్ నెలలో కూడా ఇదే మాదిరిగా అప్పటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మార్చి 2021వరకూ ఉచిత రేషన్ పొడిగించినట్లు ప్రకటించారు. కానీ డిసెంబర్ 2020 నుండి మార్చి 2021 వరకూ ఆయన చెప్పిన విధంగా ఉచిత రేషన్ పంపిణీ జరగలేదు. ఇప్పుడు కూడా కేంద్ర మంత్రి ప్రకటించారు కానీ అందుకు సంబంధించిన ఉత్తర్వులు రాష్ట్రానికి వచ్చినట్లు లేదు. సో..కేంద్ర మంత్రుల మాటలు నీటి మీద రాతలే అనుకోవాల్సి వస్తుంది ప్రజలు.

కేంద్ర ప్రభుత్వం గత ఏడాది కరోనా నేపథ్యంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకాన్ని (పీఎంజీకేఏవై) తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఉచిత రేషన్ అందించడం ప్రారంభించారు. తొలి సారిగా ఈ స్కీమ్ ను 2020 ఏప్రిల్ నుండి జూన్ వరకూ అమలు చేశారు. తర్వాత దీన్ని 2020 నవంబర్ వరకూ పొడిగించారు. అప్పుడు బియ్యంతో పాటు శనగలు, కందిపప్పు ఉచితంగా పంపిణీ చేశారు. అదే నెలలో 2021 మార్చి వరకూ ఈ పథకాన్ని పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది కానీ పంపిణీ మాత్రం జరగలేదు. మరల ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ వచ్చిన నేపథ్యంలో ఉచిత బియ్యం పథకాన్ని మరో సారి పునరుద్దరించారు. ఈ ఏడాది మే నెల నుండి నవంబర్ వరకూ పిఎంజీకేఏవై బియ్యం పంపిణీ జరిగింది.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

9 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

12 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago