ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖలు..! ఎందుకంటే..!!

Share

కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల డీపిఆర్ లను వెంటనే సమర్పించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై ఎనిమిది, గోదావరి నదిపై ఏడు ప్రాజెక్టులకు డిపిఆర్ లను సమర్పించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదిపై 15, గోదావరి నదిపై నాలుగు కొత్త ప్రాజెక్టులు చేపట్టగా ఒక్క పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకు మాత్రమే డీపీఆర్ సమర్పించింది.

తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖలు..! ఎందుకంటే..!!
central ministergajendra singh wrote letters to telugu states cm’s

కృష్ణా, గోదావరి నదులపైే నిర్మాణంలో ఉన్న ప్రాాజెక్టులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పరస్పరం కేంద్రానికి ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ ఆరవ తేదీన జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో తీసుకున్న నిర్ణయాల అమలులో భాగంగా డీపిఆర్ లు ఇవ్వాలని కేంద్ర మంత్రి లేఖలో కోరారు. తెలంగాణ, ఏపిలో చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు అనుమతి తప్పనిసరి అని కేంద్ర మంత్రి షెకావత్ తెలిపారు. డిపిఆర్ లు సహా అన్ని రకాల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన సూచించారు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాలని కోరారు. డీపీఆర్ లు, ఇతర వివరాలు సమర్పిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని కేంద్ర మంత్రి షెకావత్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి లేఖలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.


Share

Related posts

ఏంటి నిజమా .. ఓడిపోతాము అని తెలిసే జగన్ కోర్టు మెట్లు ఎక్కుతున్నాడా ? 

sekhar

Telangana cm kcr : కేసిఆర్ మైండ్ బ్లోయింగ్ గుడ్ న్యూస్..హర్షం వ్యక్తం చేస్తున్న ప్రైవేటు స్కూల్స్ ఎంప్లాయస్

somaraju sharma

బిగ్ బాస్ 4 : “నన్ను కౌగిలించుకొని ఎన్ని రోజులైందో తెలుసా నువ్వు…?” – హవ్వా హద్దులు దాటిన మాటలు

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar