NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Central team Meets CM Jagan: జగన్ సర్కార్ పనితీరును ప్రశంసించిన కేంద్ర బృందం..!!

Central team Meets CM Jagan: ఏపిలో వరద నష్టం అంచనాకు వచ్చిన కేంద్ర బృందం జగన్ సర్కార్ పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించింది. గత మూడు రోజులుగా కేంద్ర బృందం వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ బృందంతో సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భేటీ అయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాము పరిశీలించిన అంశాలను సీఎం వైఎస్ జగన్ కు కేంద్ర బృందం వివరించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్ఎండీఏ సలహాదారు కునాల్ సత్యార్ధి వివరాలను అందించారు.

Central team Meets CM Jagan: కడప జిల్లాలో వరదల నష్టం అధికం

ఈ సందర్భంగా కునాల్ సత్యార్ధి మాట్లాడుతూ మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించామనీ, కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు లాంటి మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయనీ, పశువులు చనిపోవడం జరిగిందన్నారు. తమ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహకరించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ప్రశంసనీయమన్నారు. కరువు ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిశాయనీ, ఈ స్థాయిలో వరదను నియంత్రించగలిగే రిజర్వాయర్లు, డ్యామ్ లు ఈ ప్రాంతంలో లేవని అన్నారు. ఉన్న డ్యామ్ లు, రిజర్వాయర్ లు కూడా ఈ స్థాయి వరదలను ఊహించి నిర్మించినవి కావని పేర్కొన్నారు. కరువు ప్రాంతంలో కుంభవృష్టి. నిరంతరం మంచి వర్షాలు కురిసే ప్రాంతంలో కరువు లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు. కడప జిల్లాలో వరదల వల్ల నష్టం అధికంగా ఉందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన చోట నష్టం అపారంగా ఉందన్నారు.

చిత్తూరు జిల్లాలో కొంత భాగం, నెల్లూరు జిల్లాలో కూడా వరదల ప్రభావం అధికంగా ఉందని అన్నారు. కడప జిల్లాలో మౌలిక సదుపాయాల నిర్మాణాలు దారుణంగా దెబ్బతిన్నాయనీ, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రైతుల పంట చేతికి అందే సమయంలో నీట పాలైందన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో అధికారుల పని తీరు ప్రశంసనీయమన్నారు. సహాయ కార్యక్రమాలకు కలెక్టర్ లు తక్షణం నిధులు విడుదల చేశారన్నారు. యుద్ద ప్రాతిపదికన పనులు జరిగాయన్నారు. వీలైనంతమేర ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తామని సత్యార్ధి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కేంద్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. అయితే ధాన్యం కొనుగోలులో నిబంధనల సడలింపు చేయాలని ఏపి ప్రభుత్వం కోరింది. భారీ వర్షాలు కారణంగా పంటలు దెబ్బతిన్నందున తేమ, ఇతరత్రా నిబంధనల విషయంలో సడలింపులు ఇవ్వాలని కోరింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?