ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఇవేళ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశారు. టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చాగంటి ..తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. చాగంటితో పాటు శాంతా బయోటెక్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేఇ వరప్రసాద్ రెడ్డి కూడా సీఎం జగన్ తో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా చాగంటిని సీఎం జగన్ సత్కరించి వెంకటేశ్వరస్వామి జ్ఞాపికను అందజేశారు. సీఎం జగన్ తో భేటీ అనంతరం .. సీఎం నివాసం వద్ద గోశాలను చాగంటి సందర్శించారు. గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారంటూ చాగంటి ప్రశంసించారు.
ఏపీ సీఎం జగన్ పనితీరు ప్రశంసించిన జేఎస్‌డబ్ల్యు గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్