NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandra Babu Naidu: వైసీపీ నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు కూడా సరిపోవంటూ చంద్రబాబు సీరియస్ కామెంట్స్

Chandra Babu Naidu: రాష్ట్రంలో వైసీపీ నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు కూడా సరిపోవంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా చింతలపూడిలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రను చంద్రబాబు పరామర్శించారు. సంగం డైయిరీ కేసులో అరెస్టు అయి జైలుకు వెళ్లి వచ్చిన నరేంద్ర ఇంటికి చంద్రబాబు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా నరేంద్ర కు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. అనంతరం చంద్రబాబు మీడియా సమావేశంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్పించారు.

Chandra Babu Naidu slam ycp govt
Chandra Babu Naidu slam ycp govt

Read More: Peddireddy Ramachandra Reddy: జీవో నెం.2ను హైకోర్టు రద్దు చేయడంపై మంత్రి పెద్దిరెడ్డి స్పందన ఇదీ..!!

దూళిపాళకు ప్రజలకు కూడా అండగా నిలవాలన్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కల్గిన కుటుంబం నరేంద్రది అని పేర్కొన్న చంద్రబాబు గతంలో దూళిపాళ్ల వీరయ్య చౌదరి ఇప్పుడు నరేంద్ర ఇక్కడి ప్రజలకు, సంగం డెయిరీ రైతాంగానికి అండగా ఉంటున్నారన్నారు. వరుసగా ఈ నియోజకవర్గానికి అయదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు ఎనలేని సేవలు అందించారని నరేంద్రను కొనియాడారు. రైతుల కోసం నిరంతరం కృషి చేసిన నరేంద్ర కుటుంబాన్ని రాజకీయ కక్షతోనే వైసీపీ ప్రభుత్వం కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. విలువలు లేని కక్షసాధింపు రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. సంగం, విశాఖ డెయిరీలు చట్టప్రకారం బదిలీ అయ్యాయని చెప్పారు. సంగం డెయిరీ ఆధ్వర్యంలో ఓ ఆసుపత్రి ఏర్పాటు చేసి డెయిరీ రైతులకు సేవలు అందిస్తున్నారన్నారు.

చట్టాన్ని అల్లంఘించి పని చేసే అధికారులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. ఈ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించే అచ్చెన్నాయుడు, నరేంద్ర వంటి వారిని అరెస్టు చేసి ప్రజలను డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో చేస్తున్న అవినీతిని విచారించేందుకు కోర్టులు కూడా చాలవని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇదే విధంగా ముందుకు వెళితే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. సోషల్ మీడియా కేసులో అరెస్టు చేయవద్దని సుప్రీం కొర్టు చెప్పినా వీళ్లు అరెస్టులు చేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం సర్పంచ్ల అధికారాలను సైతం నిర్వీర్యం చేయాలని చూస్తే కోర్టు అక్షింతలు వేసిందన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!