Chandra Babu: వైసీపీ సర్కార్ పై సీరియస్ కామెంట్స్ చేసిన చంద్రబాబు..!!

Share

Chandra Babu: ఏపిలో నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు 12 మున్సిపాలిటీ  లకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. ఆయా మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల జాబితాలను రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. అయితే నెల్లూరు నగర పాలక సంస్థతో పాటు కుప్పం, దర్శి, గురజాల తదితర ప్రాంతాల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడి, బలవంతంగా, ఫోర్జరీ సంతకాలతో నామినేషన్లు ఉపసంహరించారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ చర్యలను తీవ్రంగా ఖండించారు ప్రశాంతంగా ఉండే కుప్పంలో అలజడి సృష్టిస్తున్నారనీ ఆందోళన వ్యక్తం చేశారు.

Chandra Babu slams ycp govt
Chandra Babu slams ycp govt

Read more: Chandra Babu: కుప్పంలో చంద్రబాబుకు షాక్ ఇచ్చిన పెద్దిరెడ్డి ..! ఎస్ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు..!!

Chandra Babu: ఎన్నికల్లో ఇన్ని అక్రమాలా..?

ఇంతకు ముందు ప్రతి ఎన్నికల్లోనూ తాను ప్రచారానికి పోకపోయినా కుప్పం ప్రజలు గెలిపించే వారని అన్నారు. రిటర్నింగ్ అధికారులు గతంలో అభ్యర్ధులకు సహకరించేవారని అన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి అలాలేదన్నారు. టీడీపీ అభ్యర్ధి వెంకటేష్ నామినేషన్ వేసేందుకు వెళుతుంటే బుల్లెట్ తో ఢీకొట్టి అతని వద్ద నామినేషన్ పత్రాలు లాక్కొని వెళ్లిపోయారనీ, తరువాత పోలీసుల సహయంతో రెండో రోజు నామినేషన్ వేస్తే స్క్రూటినీలో తొలగించారన్నారు. మాజీ మంత్రి అమర్‌నాధ్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి ఈడ్చుకువెళ్లారన్నారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. మళ్లీ రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమేననీ పేర్కొంటూ చట్టాన్ని అల్లంఘించిన వారు ఎవరైనా సరే సాక్షాలతో దోషులుగా నిలబెడతామని చంద్రబాబు హెచ్చరించారు. కుప్పం, నెల్లూరు, దర్శి, గురజాల, దాచేపల్లి ఇలా అనేక ప్రాంతాల్లో వైసీపీ వాళ్లు టీడీపీ అభ్యర్ధులను బెదిరించడం, ప్రలోభాలకు గురి చేయడం లాంటి చర్యలకు పాల్పడ్డారని అన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా పోటీ చేసి గెలుపొందితే ఎటువంటి ఇబ్బంది లేదనీ, ఎన్నికల్లో అక్రమాలకు, దౌర్జన్యాలకు పాల్పడటం హేయమైన చర్య అని  చంద్రబాబు అన్నారు. వైసీపీ వాళ్లే తప్పులు, దౌర్జన్యాలు చేస్తూ మళ్లీ టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడతారా అంటూ ప్రశ్నించారు. పులివెందుల పంచాయతీలు జరగనివ్వబోమని చంద్రబాబు పేర్కొన్నారు.

Chandra Babu: నామినేషన్ ఉపసంహరించుకోలేదు

కుప్పం 14వ వార్డు టీడీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన ప్రకాశ్ తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చంద్రబాబు సమక్షంలో మీడియాకు వెల్లడించారు. తాను నామినేషన్ విత్ డ్రా చేసుకోకపోయినా ఫోర్జరీ సంతకంతో తన నామినేషన్ తొలగించారని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతునారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నారు.


Share

Related posts

బ్రేకింగ్ : అచ్చన్నాయుడు అరస్ట్ కి కారణం అయిన ప్రూఫ్ ఇదే .. ఈ లెటర్ వల్లే జైలుకి ?

arun kanna

Pushpa : “పుష్ప” ఫస్ట్ సింగిల్ ‘దాక్కో దాక్కో మేక’ రిలీజ్ డేట్ ఫిక్స్

GRK

బ్రేకింగ్: ఉత్కంఠ వేళ.. ఆర్మీ కీలక నిర్ణయం!

Vihari