NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandra Babu : చంద్రబాబుకు వైసీపీ షాక్ లు..! మామూలుగా ఇవ్వడం లేదుగా..!!

Chandra Babu : రాష్ట్రంలో పురపాలక సంఘ ఎన్నికలు నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రకటన చేసిన తొలి సింబల్ ఎన్నికలు కావడంతో కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమలో పులపాలక ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేదాని పై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ ఎన్నికలను అధికార వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే పురపాలక ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు కైవశం చేసుకుని టీడీపీకి గట్టి షాక్ ఇవ్వాలన్న లక్ష్యంతో అధికార వైసీపీ ఉంది. ఈ క్రమంలో సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పటికే 15 నుండి 20 శాతం వైసీపీ ఏకగ్రీవం చేసుకున్నది. ఇక ఎన్నికలు జరుగుతున్న 60 శాతం పైగా సాధిస్తే వైసీపీ అనుకున్న ఫిగర్ 80 శాతం వచ్చినట్లే.

Chandra Babu : three capital issue protest
Chandra Babu three capital issue protest

ప్రధానంగా విశాఖ, గుంటూరు, విజయవాడ నగర పాలక సంస్థలతో పాటు మేజర్ మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలను వైసీపీలో చేర్చుకుని కండువాలు కప్పేస్తున్నారు. ఇదే క్రమంలో రాజధాని అమరావతికి మద్దతు తెలియజేస్తున్న చంద్రబాబును ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నంతో ఆ ప్రాంతంలో సెంటిమెంట్ రాజేశారు. దీంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న చంద్రబాబుకు నిరసన సెగలు ప్రారంభం అయ్యాయి. ఓ పక్క టీడీపీ నాయకులు, కార్యకర్తలను లాగేసుకోవడం, మరో పక్క మూడు రాజధానులకు అనుకూలమైన వర్గాలతో నిరసనలు చేయించడంతో టీడీపీ నాయకులు ఖంగుతింటున్నారు.

మొన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు కర్నూలు పర్యటనలో న్యాయవాదుల నిరసన సెగ తగిలింది. కర్నూలుకు హైకోర్టు రాకుండా అడ్డుకుంటున్నారంటూ న్యాయవాదులు గోబ్యాక్ నినాదాలు చేశారు. అదే మాదిరిగా నిన్న విశాఖలో కొందరు ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. అయితే ఇవన్నీ వైసీపీ చేయిస్తుందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏది ఎలా ఉన్న కీలకమైన విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాల ప్రజల తీర్పు ఎలా ఉంటుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!