NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి అంశంపై చంద్రబాబు వర్సెస్ సజ్జల హాట్ కామెంట్స్ ఇలా..

ఏపి రాజధాని అమరావతి అంశంపై నిన్న సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు రాజ్యసభలో కేంద్రం సమాధానం ఇవ్వడం తెలిసిందే. దీంతో అమరావతి అంశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం మీడియా సమావేశంలో ఆ అంశాలను ప్రస్తావిస్తూ జగన్మ సర్కార్ చర్యలను తీవ్ర స్థాయిలో విమర్శించారు. చట్టంలో లేని అధికారాన్ని జగన్ తన చేతిల్లోకి తీసుకున్నారని దుయ్యబట్టారు. జగన్ చేసే విధ్వంసాలను సరిదిద్దడం.. రాజ్యాంగ సంస్థలకు కూడా కష్టంగా మారిందని విమర్శించారు.

Chandrababu

 

చట్టానికి వ్యతిరేకంగా జగన్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి ఏర్పాటు రహస్యంగా చేసింది కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చర్చలు జరిపామని తెలిపారు. ప్రధాని మోడీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారని, అమరావతికి అండగా ఉంటానని చెప్పారని గుర్తు చేశారు. రాజధాని విషయంలో జగన్ మార్చారని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా నాడు జగన్ చెప్పింది ఏమిటి.. ఇప్పుడు చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు. విభజన చట్టం సెక్షన్ 5 లో రాజధానిపై స్పష్టంగా ఉన్నా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. జగన్ ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని విమర్శించారు. చట్టాలు చేసే హక్కు శాసనసభకు లేదా అంటూ వక్రీకరించి మాట్లాడారని అన్నారు.

sajjala Rama Krishna Reddy

 

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాజధానిపై పచ్చ మీడియా అసత్యాలు చేస్తొందని సజ్జల మండిపడ్డారు. పచ్చ మీడియా అడుగడుగునా ప్రజలను తప్పుదోవ పట్టించాలని యత్నిస్తున్నారన్నారు. సీఎం జగన్ పై చంద్రబాబు అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. అమరావతి భూములు ధరలు పెంచుకుని చంద్రబాబు అండ్ కో ప్రయోజనాలు పొందాలనుకున్నారని ఆరోపించారు. సీఎంగా ఉండి చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా వ్యవహరించారన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి అంశంతో చంద్రబాబు లబ్దిపొందాలని చూస్తున్నారమని మండిపడ్డారు. ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ జరగకపోయినా రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలోనే ఇజ్రాయిల్ టెక్నాలజీతో ఫోన్ ట్యాపింగ్ లు చేశారని ఆరోపించారు.

జగన్ అసెంబ్లీలో మాట్లాడిన మాటలను చంద్రబాబు వక్రీకరించారని పేర్కొన్నారు. చంద్రబాబు తన స్థాయి దిగజారి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతిని డిక్లేర్ చేసిన తర్వాత చంద్రబాబు కేంద్రాన్ని సంప్రదించలేదని, అప్పటి మంత్రి నారాయణతో కమిటీ వేసి వారంలో రాజధాని ప్రకటించారని అన్నారు. అమరావతిని వారికి బంగారు గుడ్డు పెట్టే బాతులా మార్చాలని అనుకున్నారని సజ్జల దుయ్యబట్టారు. చంద్రబాబు బినామీల పేరుతో ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారనీ ఆరోపించారు. అమరావతిని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని, దోచుకోవడం ఒక్కటే చంద్రబాబుకు తెలుసునని విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని, ఆ ధిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు సజ్జల.

కోటంరెడ్డి వర్సెస్ ఆదాల ..నెల్లూరు రూరల్ లో హాట్ హాట్ గా వైసీపీ రాజకీయం

author avatar
sharma somaraju Content Editor

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N