Chandrababu: కుప్పంలోనే చంద్ర‌బాబు ప‌రిస్థితి ఎందుకిలా అయిపోయిందో తెలుసా?

Chandrababu : అయ్యో కర్రా!!! నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా బాబు??
Share

Chandrababu: కుప్పం… రాజ‌కీయాల గురించి తెలిసిన వారికి ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇలాకా. అక్క‌డ ఆయ‌న‌దే ఆదిప‌త్యం. అలాంటి కుప్పం నియోజక వర్గంలో తెలుగుదేశం పార్టీ బ్యానర్‌ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు త‌మదైన శైలిలో హల్ చల్ చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి కోరుతూ జెండాలు కట్టి, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. కుప్పంలోనే చంద్ర‌బాబుకు న‌చ్చ‌ని ప‌ని ఎందుకు జ‌రిగింద‌న్న‌ది ఇప్పుడు హాట్ టాపిక్‌.

 

Read More: Corona: కరోనాతో పిల్లలకు ప్రమాదం లేదు – ఎవరు ప్ర‌క‌టించారో తెలుసా?

కుప్పంలో ఇలా…

కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయతీ ములకలపల్లి గ్రామానికి చెందిన‌ ఎన్టీఆర్ అభిమానులు జూనియ‌ర్‌ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటూ 40 అడుగుల ఎత్తులో జూనియ‌ర్‌ ఎన్టీఆర్ జెండాను ఎగరేశారు. తెలుగుదేశం బ్యాక్ గ్రౌండ్ లో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైర‌ల్ అయ్యాయి. రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీశాయి.

Read More: Corona: వాట్సాప్ తో క‌రోనా టెస్ట్ … ఎంత ఈజీగా చేసుకోవ‌చ్చంటే…

Chandrababu : అయ్యో కర్రా!!! నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా బాబు??

గ‌తంలోనే…

చంద్రబాబు సొంత నియోజకవర్గమైన‌ కుప్పంలో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు, జెండా ఏర్పాటు చేయ‌డం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. అయితే, కుప్పంలో ఇలా జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. చంద్రబాబునాయుడు ఇటీవ‌ల కుప్పం పర్యటనకు వెళ్లిన స‌మ‌యంలోనూ ఎన్టీఆర్ అభిమానుల నిరసన సెగ తగిలింది. చంద్రబాబు ప్రసంగిస్తున్న స‌మ‌యంలో పార్టీలోకి జూనియ‌ర్ ఎన్టీఆర్ ను ఎప్పుడు తీసుకువస్తున్నారంటూ కార్యకర్తలు అడిగారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలంటూ వారు నినాదాలు చేశారు. ఆ స‌మ‌యంలో చంద్రబాబు వారికి సర్దిచెప్పారు. అయితే, తిరిగి అదే ప‌రిస్థితి కుప్పంలో జ‌ర‌గ‌డం స‌హ‌జంగానే కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపుతోంది.


Share

Related posts

Hydrabad : హైదరాబాద్ నెత్తిన పిడుగు!

Comrade CHE

3 కి.మీ ట్రక్కు ని రివర్స్ గేర్ లో నడిపిన డ్రైవర్.. అసలు ఏం జరిగిందో చూడండి..

bharani jella

ఆన్ లైన్ విద్యాబోధనలకు అనేక సవాళ్లు.. !!

somaraju sharma