NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: కొడాలి నాని ని ఎలాగైనా ఓడించాలి అనే ప్లాన్ వేసిన చంద్రబాబు – ఇది వర్క్ అయ్యేలాగే ఉందే !

Advertisements
Share

Chandrababu: తెలుగుదేశం పార్టీకి ఆ నియోజకవర్గం ఒక సవాల్ గా మారింది. టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీ కంచుకోట. కానీ ఇప్పుడు అది ఆ అభ్యర్ధి కారణంగా వైసీపీ స్ట్రాంగ్ అయ్యింది. ఈ సారి ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరాలి అన్నది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆ పార్టీ శ్రేణులు ఆశపడుతున్నారు. ఇంతకు ఆ నియోజకవర్గం ఏది అంటే కృష్ణాజిల్లాలోని గుడివాడ. పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఆ నియోజకవర్గాన్ని గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే.. తమ పార్టీలో రాజకీయంగా ఎదిగి రెండు సార్లు ఎమ్మెల్యేగా అయిన మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీలో చేరిన తర్వాత దారణంగా విమర్శలు చేస్తుండటం టీడీపీ అధిష్టానంతో పాటు పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే కొడాలి నానికి ఓటమి రుచి చూపించాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు చంద్రబాబు. ఒక వేళ గుడివాడలో టీడీపీ గెలిస్తే ఆ పార్టీ శ్రేణుల ఆనందానికి అవధులు ఉండవు. సంచలనమే అవుతుంది.

Advertisements

 

వైసీపీలో ఏ నాయకులు విమర్శించని రీతిలో కొడాలి నాని.. చంద్రబాబు, లోకేష్ పై ఘాటుగా విమర్శలు చేస్తుంటారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ 11 సార్లు ఎన్నికలు జరగ్గా 8 సార్లు టీడీపీ అభ్యర్ధులే విజయం సాధించారు. 2004,2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి వెంకటేశ్వరరావు (నాని)  ఆతర్వాత వైసీపీ లో చేరారు. 2014,2019 ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించారు. జగన్మోహనరెడ్డి తొలి కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని నియోజకవర్గంలో మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఎట్టిపరిస్థిల్లోనూ గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి గెలవాలని ఫిక్స్ అయిన పార్టీ అధినేత చంద్రబాబు.. ఆ నియోజకవర్గ నేతలకు ఇటీవల దిశానిర్దేశం చేశారు.

Advertisements

 

గుడివాడలో టికెట్ ఎవరి ఇవ్వనున్నారు అనే దానిపై పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. నియోజకవర్గంలో స్ట్రాంగ్ క్యాండెట్ గా ఉన్న కొడాలి నానిని ఢీకొట్టాలంటే అర్ధబలం, అంగబలంతో పాటు కష్టపడి పని చేసే తత్వం ఉన్న నేత అయి ఉండాలని భావిస్తున్నారు చంద్రబాబు. కష్టపడి పని చేసే వారికే గుడివాడ టికెట్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. గుడివాడలో గెలుపునకు కార్యకర్తలు అంతా ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం ఎవరెవరు ఎంత వరకు కష్టపడుతున్నారు అనే విషయాలపై తన వద్ద డేటా ఉందని బాబు చెబుతున్నారు. గుడివాడ టీడీపీ ఇన్ చార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుతో పాటు ఎన్ఆర్ఐ వెనిగెళ్ల రాము ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. రావి, వెనిగెళ్ల కలిసి పని చేస్తే కొడాలిని ఓడించడం సులువు అవుతుందని పార్టీ ఆలోచన.

వెనిగళ్లకు టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. సీనియర్ నేత రావికి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎమ్మెల్సీ గా కీలక పదవి ఇచ్చి గౌరవిస్తామని అధిష్టానం నచ్చజెబుతున్నట్లుగా తెలుస్తొంది. రావి వెంకటేశ్వరరావు 2000 లో జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. కొడాలి నానికి టికెట్ ఇవ్వగా ఆయన గెలిచారు. ఆ తర్వాత రావి టీడీపీకి రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. రావి దాదాపు 28వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.  ఆ తర్వాత మళ్లీ టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో కొడాలి నానిపై పరాజయం పాలైయ్యారు.

 

2019 ఎన్నికల్లో రావిని పక్క పెట్టి దేవినేని అవినాష్ కు టిడీపీ టికెట్ ఇచ్చింది. అవినాష్ ఓటమి తర్వాత టీడీపీ కి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. దీంతో నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిగా రావి వెంకటేశ్వరరావు బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. టీడీపీ అధిష్టానం గుడివాడను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కారణంగా రసవత్తర పోరు జరుగుతుందని భావిస్తున్నారు. చంద్రబాబు వ్యూహాలు గుడివాడలో వర్క్ అవుట్ అవుతాయో లేదో వేచి చూడాలి.

Jamili Elections:  ‘నేను సిద్ధం , కానివ్వండి’ లండన్ నుంచే జమిలీ ఎన్నికలకి మోడీ తో జగన్ గ్రీన్ సిగ్నల్ !!


Share
Advertisements

Related posts

Ys Jagan Mohan Reddy : ఏపీ వలంటీర్ ల పట్ల జగన్ కి ఉన్న ప్రేమ ఏంటో రుజువు చేసిన సంఘటన..!!

sekhar

Timws Now: టైమ్స్ నౌ సర్వే.. మరల అక్కడ మోడీ .. ఇక్కడ జగన్ హవానే

somaraju sharma

ఇక ఫాస్టాగ్‌తో పార్కింగ్ ఫీజు కూడా చెల్లించ‌వ‌చ్చు..!

Srikanth A