NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chandrababu: ప్రత్యేక హోదాపై చంద్రబాబు కొత్త పల్లవి ..! వైసీపీ ఎందుకు కలసి వస్తుంది..?

Chandrababu: ప్రత్యేక హోదా ఏమై సంజీవనా, ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాల్లో ఏమి జరిగింది, ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ముద్దు అని అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా వదులుకొని ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు కొత్త పల్లివి ఎత్తుకున్నారు. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో లేనప్పుడు ఒకలా వ్యవహరించడం సహజమే. ఆ విషయంలో టీడీపీ గానీ వైసీపీగా గానీ బీజేపీ గానీ అన్ని ఒక తానులోకి ముక్కలే అనాల్సిందే. ప్రత్యేక హోదా విషయంలో గతంలో రాజ్యసభ వేదికగా గట్టిగా మాట్లాడిన నేటి ఉపరాష్ట్రపతి, నాటి బీజేపీ రాజ్యసభ సభ్యుడు వెంకయ్య నాయుడు నేడు ఆ విషయం గురించే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం లేదు. నాడు ప్రత్యేక హోదా అవసరం లేదు ప్యాకేజీ చాలు అన్న తెలుగు దేశం ఇప్పుడు ప్రత్యేక హోదా అంటోంది. అప్పుడు 25 స్థానాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామన్న వైసీపీ నేడు విజ్ఞప్తులకే పరిమితం అయ్యింది.

Chandrababu challenge to ycp for ap special status issue
Chandrababu challenge to ycp for ap special status issue

 

Chandrababu: ఎంపీలు రాజీనామా చేయాలి

తాజాగా ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని టీడీపీ అధినేత చంద్రబాబు ఎండగట్టారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ లో ప్రకటించిందని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ఎంపీలు ఏమి చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. హోదాపై ఇంకా ఎన్నాళ్లు ప్రజలను మభ్యపెడతారని చంద్రబాబు మండిపడ్డారు. దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా తీసుకువస్తామనీ, అలా చేయని పక్షంలో రాజీనామా చేస్తామని సీఎం జగన్ గతంలో చెప్పారని గుర్తు చేసిన చంద్రబాబు.. వైసీపీకి ఏమాతం చిత్తశుద్ది ఉన్నా ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని, అందరం కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడదామని అన్నారు. మాయ మాటలు, సన్నాయి నొక్కులు, డైవర్షన్లు వద్దని ఈ సవాల్ కు సిద్దమా అని చంద్రబాబు ప్రశ్నించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju