NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandra Babu: కుప్పంలో చంద్రబాబుకు షాక్ ఇచ్చిన పెద్దిరెడ్డి ..! ఎస్ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు..!!

Chandra Babu: వైసీపీ సర్కార్, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత నియోజకవర్గంలోనే గట్టి షాక్ ఇచ్చి వాయిస్ లేకుండా చేయాలన్న లక్ష్యంతో వైసీపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో భాగం మొదటి అడుగులో విజయం సాధించింది. రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలు, ఒక కార్పోరేషన్ (నెల్లూరు)కు ఈ నెల 15వ తేదీన పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీ కూడా ఉండటంతో వైసీపీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం మున్సిపాలిటీ గెలుపును తన భుజస్కందాలపై వేసుకుని పావులు కదుపుతున్నారు. అయితే వైసీపీ ఎత్తులు, టీడీపీ పై ఎత్తులతో కుప్పం మున్సిపల్ ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. ఈ క్రమంలోనే 14వ వార్డును ఎలాగైనా ఏకగ్రీవం చేసుకోవాలని వైసీపీ ప్లాన్ వేసింది. వైసీపీ ప్లాన్ ను ముందే పసిగట్టిన టీడీపీ నేత, మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి, చంద్రబాబు పీఏలు అప్రమత్తతతో ఆ వార్డు ఏకగ్రీవం కాకుండా ఉండేందుకు ఆ వార్డులో పోటీ చేసిన అభ్యర్థి కుటుంబాన్ని తమ వద్ద పెట్టుకున్నా.. వైసీపీ ఏదో విధంగా చక్రం నడిపింది. ఆ అభ్యర్ధి నామినేషన్ ఉపసంహించుకున్న కారణంగా వైసీపీకి ఏకగ్రీవం అయినట్లు ఆర్ఒ ప్రకటించడంతో చంద్రబాబు అడ్డాలో వైసీపీ ఒక అడుగు ముందుకు వేసినట్లు అయ్యింది.

Chandrababu complaint to cesc for kuppam municipal election issue
Chandrababu complaint to cesc for kuppam municipal election issue

Chandra Babu: మూడు వార్డుల్లో టీడీపీ అభ్యర్ధుల నామినేషన్లు ఉపసంహరణ

అసలు ఏమి జరిగింది అంటే…14వ వార్డు నుండి టీడీపీ తరపున వెంకటేశ్, ప్రకాశ్ ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు.  అయితే వెంకటేశ్ నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో నామినేషన్ ఓకే అయిన ప్రకాష్ కుటుంబ సభ్యులను బెదిరించి నామినేషన్ ఉపసంహరించే అవకాశాలు ఉన్నాయని భావించిన టీడీపీ నేతలు ప్రకాష్ తో సహా అతని కుటుంబ సభ్యులను రహస్య ప్రాంతానికి తరలించారు. ఈ నేపథ్యంలో తన సోదరుడి కుటుంబాన్ని టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారంటూ ప్రకాష్ సోదరుడితో వైసీపీ నేతలు  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించారు. అయితే అదే రోజు సాయంత్రానికి ప్రకాశ్ కుటుంబం తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదంటూ వీడియో సందేశం ఇచ్చారు. అయితే తాను కుప్పం మున్సిపాలిటీ ఆఫీసుకు వచ్చి నామినేషన్ ను విత్ డ్రా చేసుకోకపోయినా అధికారులు ఫోర్జరీ సంతకంతో తన నామినేషన్ ను ఉపసంహరించారంటూ ప్రకాష్ ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై టీడీపీ నేతలు సోమవారం రాత్రి కుప్పం మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. కుప్పంలో ఇదే మాదిరిగా 13,15 వార్డులకు సంబంధించి టీడీపీ అభ్యర్ధుల నామినేషన్లను ఫోర్జరీ సంతకాలతో విత్ డ్రా చేయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Chandra Babu: ఎస్ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

ఫోర్జరీ సంతకాలతో కుప్పం మున్సిపాలిటీలోని 13,14,15 వార్డుల టీడీపీ అభ్యర్ధుల నామినేషన్లు ఉపసంహరించారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) చంద్రబాబు ఫిర్యాదు చేశారు. టీడీపీ అభ్యర్ధులు పోటీలో లేకుండా చేసేందుకు తప్పుడు మార్గాలను అనుసరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తక్షణమే 13,14,15 వార్డుల ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేసి సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సహకరించాలని చంద్రబాబు విజ్ఞఫ్తి చేశారు. ఎన్నికల సంఘం స్పందించకపోతే కోర్టుకు వెళ్లే ఆలోచన కూడా టీడీపీ చేస్తున్నట్లు సమాచారం.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju