Chandrababu: చంద్రబాబుకు వచ్చిన సరికొత్త కష్టం చూసి జగన్ కూడా అయ్యో పాపం అనుకున్నాడు..!

Share

Chandrababu: రాజకీయాల్లో నేతలకు గెలుపు ఓటములు సహజం. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అధికారం అనేది ఎవ్వరికీ ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కాకపోతే అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు.. నరేంద్ర మోడీ, షీలా దీక్షిత్, జ్యోతిబసు, మమతా బెనర్జీ వంటి నేతల మాదిరిగా వరుస విజయాలతో సీఎం సీటు తమదేనని భావిస్తూ 20 ఏళ్లకు, 30 ఏళ్లకు ప్రణాళికలు వేసుకుంటుంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అదే మాదిరిగా నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా అయిన తరువాత ముఖ్యమంత్రి పీఠం తను ఉన్నంత కాలం తనదేనని అనుకున్నారు. కానీ రాజకీయాలు ఎప్పుడూ ఒకే లాగ ఉండవు కదా. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు తన రాజకీయ అనుభవం అంత వయసు లేని జగన్మోహనరెడ్డి పన్నిన ఉచ్చులో బిగుసుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ లో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు కనబడుతోంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ ట్రాప్ లో చిక్కుకుని కేంద్రంలో భాగస్వామ్య పక్షమైన బీజేపీతో దోస్తీ కటీఫ్ చెప్పారు. ప్రత్యేక హోదా అంటూ కేంద్రంలోని మోడీ సర్కార్ పై ధర్మపోరాట దీక్షల పేరుతో యుద్దం ప్రకటించారు. తెలంగాణకు జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో జత కట్టి కేసిఆర్ ఆగ్రహానికి గురైయ్యారు. అటు మోడీ, ఇటు కేసిఆర్ రాజకీయ ఎత్తుగడలు జగన్మోహనరెడ్డికి తోడవ్వడంతో 2019 ఎన్నికల్లో టీడీపీ డక్ అవుట్ అయ్యింది.

Chandrababu cosantration on kuppam
Chandrababu cosantration on kuppam

 

Chandrababu: కుప్పంపై కాన్సన్ట్రేషన్

ఇప్పుడు వైసీపీ మరో సారి చంద్రబాబుతో గేమ్ స్టార్ట్ చేసింది. మండల పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో టీడీపీకి పరాజయాన్ని పరిచయం చేసింది వైసీపీ. మరో పక్క చంద్రబాబుపై పరాజయం పాలైన వైసీపీ అభ్యర్ధి చంద్రమౌళి కుమారుడిని ఎమ్మెల్సీ చేసింది వైసీపీ. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామంటూ కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పం కాన్సన్ట్రేషన్ పెట్టారు చెప్పారు. కుప్పం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లకుండా గెలుస్తూ వచ్చిన చంద్రబాబు గతంలో ఆరు నెలలకు ఒక సారి వెళ్లివచ్చే వారు. అప్పుడు కూడా నియోజకవర్గ స్థాయి నేతలతో సమీక్షలు చేసి వచ్చేవారు. స్థానిక సమస్యలను అక్కడి నేతలే పరిష్కరిస్తూ వచ్చే వారు.

 

Read More: TDP: అసలే కష్టాల్లో ఉన్న చంద్రబాబుకు కొత్తగా మరో మూడు తలనొప్పులు..!?

బ్రహ్మరథం పడుతున్నప్పటికీ

అయితే ప్రస్తుతం పరిస్థితులు పూర్తి గా మారిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పం నియోజకవర్గంలో నెలకు రెండు మూడు సార్లు పర్యటిస్తున్నారు చంద్రబాబు. నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నప్పటికీ వైసీపీ రాజకీయ ఎత్తులు ఎలా ఉంటాయో తెలియని పరిస్థితిలో కేడర్ ను కాపాడుకోవడానికి చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారని టాక్. కుప్పంపై పూర్తిగా ఫోకస్ పెట్టి రెండు మూడు సార్లు పర్యటనలు చేస్తుండటంతో చంద్రబాబు తన సొంత నియోజకవర్గానికి పరిమితం అయ్యారంటూ అధికార పక్ష నేతలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో పడుతున్న కష్టం చూసి సీఎం జగన్ కూడా అయ్యో పాపం అనుకుంటున్నారట..!

Read More: RRR: ఆ ఒక్క సర్వే చూసుకుని రెచ్చిపోతున్న రాజు గారు, నరసాపురం గెలుపు గ్యారెంటీ అని తెల్చిన నేషనల్ సర్వే?


Share

Related posts

క‌రోనా ఎఫెక్ట్‌.. నిమ్మ‌పండ్లు, గుడ్ల‌ను తెగ తింటున్నారు..!

Srikanth A

New Born Babies: ఏటా ఎంతమంది శిశువులు పుడుతున్నారో తెలిస్తే షాక్ అవుతారు! ఇక ఆధార్ పరిస్థితి ఏంటి?

Ram

‘బుడత సాహసం భళా’

somaraju sharma