NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Chandra Babu: కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు..! టీడీపీ నేతల్లో గుబులు..? జగన్ ను చంద్రబాబు ఫాలో అవుతున్నట్లేగా..!!

Chandra Babu: 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేత ఎప్పుడూ చూడలేని గడ్డు పరిస్థితిని చూస్తున్నారు. తన రాజకీయ అనుభవం ఉన్నంత వయసు లేని రాజకీయ ప్రత్యర్ధిని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారు. తన రాజకీయ జీవితంలో ఏంతో మంది గట్టి నాయకుల ముందు సమర్ధవంతంగా రాజకీయాలు నడిపి రాష్ట్ర, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. కానీ నేడు సహచరుడి కుమారుడి రాజకీయ ఎత్తుల ముందు పరాజయం పాలవుతూ వస్తున్నారు. అందుకు 2019 సార్వత్రిక ఎన్నికలు, ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇకపై ప్రత్యర్ధి పార్టీని ఎదుర్కోవాలంటే వారు 2019 ఎన్నికల్లో అనుసరించిన పొలిటికల్ స్ట్రాటజీలనే అనుసరించడానికి సిద్ధం అవుతున్నట్లుగా ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ పరంగా 2024 ఎన్నికల వ్యూహం కోసం చంద్రబాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది.

Chandrababu key decision on election strategy
Chandrababu key decision on election strategy

 

Chandra Babu: పీకే స్ట్రాటజీతో జగన్ ముందుకు

2019 ఎన్నికల్లో నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ (పీకే) వ్యవహరించారు. పీకే స్ట్రాటజీ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక చేశారు జగన్మోహనరెడ్డి. పీకే టీమ్ నియోజకవర్గాల్లో సర్వే జరిపిి గెలుపు గుర్రాలు ఎవరో గుర్తించి వారి పేర్లు సిఫార్సు చేసినట్లుగా సమాచారం. పాదయాత్రలోనూ జగన్మోహనరెడ్డి పీకే స్ట్రాటజీతోనే ముందుకు సాగారు వైఎస్ జగన్. దాంతో 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్ సభ స్థానాలు గెలుచుకుని ముఖ్యమంత్రి పీఠం ఏక్కారు వైఎస్ జగన్. ఆ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు పలువురు పార్టీ సీనియర్ లు కొంత మంది ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి ఉంది వాళ్లకు సీట్లు ఇవ్వవద్దని చెప్పినా ఆ మాటలను పెడ చెవిన పెట్టారుట. 1999 నుండి 2019 ఎన్నికల వరకూ టీడీపీ అభ్యర్ధుల ఎంపికను చంద్రబాబే చేశారు. పేరుకు పార్టీలో స్క్రీనింగ్ కమిటీ అనేది ఒకటి ఉన్నా అవి నామమాత్రమే. చంద్రబాబు అనుకున్న వాళ్లకే టికెట్లు ఇచ్చారనేది అందరికీ తెలిసిందే.

చంద్రబాబుకు రాబిన్ శర్మ వ్యూహలు

అయితే 2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిలో గతంలో తన పాత రాజకీయ పద్ధతుల్లో ముందుకు వెళితే లాభం లేదని గ్రహించినట్లు ఉన్నారు. అందుకే తనకు నచ్చిన నేతల కంటే ప్రజలు ఎవరు కోరుకుంటున్నారో వారినే నియోజకవర్గాలకు అభ్యర్ధులుగా ఎంపిక చేయాలని చంద్రబాబు ఆలోచనకు వచ్చారుట. ఈ సారి అందులో రాజీపడే పరిస్థితి లేదట. అందు కోసం ఇప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో సర్వేలు చేస్తున్నారుట. ఇప్పటికే గతంలో పీకే టీమ్ లో పని చేసిన ఎన్నికల వ్యూహ కర్త రాబిన్ శర్మ టీడీపీకి పని చేస్తున్నారు. రాబిన్ శర్మ నేతృత్వంలో ఒక సర్వే కొనసాగుతుండగా, మరో రెండు రెప్యుటేషన్ కల్గిన సంస్థలకు కూడా సర్వే బాధ్యతలను చంద్రబాబు అప్పగించారని వార్తలు వినబడుతున్నాయి. ఎన్నికల నాటికి మూడు దఫాలు సర్వేలు చేసి వాళ్లు చంద్రబాబుకు అందించనున్నారుట. ఈ సర్వే నివేదికల ప్రకారమే టీడీపీలో అభ్యర్ధుల ఎంపిక జరగనుందని సమాచారం. ఈ పరిణామం ప్రస్తుతం నియోజకవర్గాల్లో ఇన్ చార్జిల్లో గుబులు రేకెత్తిస్తోందని అంటున్నారు.

author avatar
Special Bureau

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?