Chandrababu Letter: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు గత 40 రోజులకుపైగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ లో ఉన్న సంగతి తెలిసిందే. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు పేరుతో ఓ బహిరంగ లేఖ విడుదలైంది. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు చంద్రబాబు.

‘నేను జైలులో లేను….ప్రజల హృదయాల్లో ఉన్నాను. ప్రజల నుంచి నన్ను ఒక్క క్షణం కూడా ఎవ్వరూ దూరం చేయలేరు. 45 ఏళ్లుగా నేను కాపాడుకుంటూ వస్తున్న విలువలు, విశ్వసనీయతని చెరిపేయలేరు. ఆలస్యమైనా న్యాయం గెలుస్తుంది..నేను త్వరలో బయటకొస్తాను. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాను. అందరికీ దసరా శుభాకాంక్షలు’ అంటూ చంద్రబాబు పేరుతో లేఖ విడుదలైంది. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
చంద్రబాబు సంతకంతో స్నేహ బ్లాక్, రాజమహేంద్రవరం జైల్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కరపత్రంపై సెంట్రల్ జైల్ సూపర్నిటెండెంట్ స్పందించారు. సదరు కరపత్రం సెంట్రల్ జైల్ నుండి జారీ చేయబడింది కాదని తెలిపారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. జైల్ నియమావళి ప్రకారం ముద్దాయిలు ఎవరైనా సంతకం చేయబడిన కరపత్రములు బయటకు విడుదల చేయాలంటే, సదరు పత్రాన్ని జైల్ అధికారులు పూర్తిగా పరిశీలించి సదరు పత్రముపై జైలర్ దృవీకరించి సంతకం, మరియు కారాగార ముద్రతో సంబంధిత కోర్టులకు లేదా ఇతర ప్రభుత్వ శాఖలకు, మరుయు కుటుంబ సభ్యులకు పంపబడుతుందన్నారు. కావున ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కరపత్రమునకు ఈ జైల్ కు ఏ విధమైన సంబంధం లేదని ఆయన తెలియజేశారు.
మరో పక్క జైల్ అధికారి వివరణ నేపథ్యంలో.. టీడీపీ నేతలే చంద్రబాబు పేరుతో లేఖ విడుదల చేసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని వైసీపీ విమర్శిస్తొంది. సానుభూతి కోసం చంద్రబాబు పేరుతో లేఖ విడుదల చేశారని అంటున్నారు.
‘ఒకరు వైకుంఠం, మరొకరు కైలాసం చూపించారు’