NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: పొత్తుల ప్రసక్తి లేకుండా చంద్రబాబు న్యూ స్ట్రాటజీ..? వర్క్‌ అవుట్ అయ్యేనా..?

Chandrababu: తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతో మంది మహామహా నేతలకు ఎదురు నిలిచి పోరాటం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన రాజకీయంగా తీవ్ర గడ్డుపరిస్థితినే ఎదుర్కొంటున్నారు. కొందరు సీనియర్‌లు పార్టీని వదిలివెళ్లిపోవడం, కొందరు అధికార పార్టీకి భయపడి సైలెంట్ కావడం, కొందరు కోవర్టులుగా మారడం, అధికార పార్టీ నేతలతో కలిసి వ్యాపారాలు చేస్తూ పబ్బం గడుపుకోవడం చూస్తూనే ఉన్నారు. ఈ కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ ఘోర ఓటమిని చవి చూసింది. చివరకు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీలోనూ వైసీపీ దెబ్బేసింది. చేతుల కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తరువాత చంద్రబాబు సమీక్షలు జరిపారు.

Chandrababu new strategy
Chandrababu new strategy

Read More: TDP Congress : టీడీపీ యూటర్న్..! ఒంటరిగానే పోటీ..!?

Chandrababu: అఖిలపక్షంగా ఏర్పడాలని

ప్రభుత్వ విధానాలపై టీడీపీ పోరాడలేకపోతుంది అన్న మాటలు వినబడుతున్నాయి. అయితే ఇప్పుడు చంద్రబాబుకు కొత్త ఆలోచన వచ్చింది అంటున్నారు. ఇటీవల తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు అన్నీ కలిసి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడి ఉద్యమం చేయడంతో చలో విజయవాడ సక్సెస్ అయ్యింది. దీంతో ప్రభుత్వం దిగివచ్చి వారితో చర్చలు జరిపి డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపింది. చంద్రబాబు కూడా ఇదే తరహాలో ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయాలని భావిస్తున్నారుట. వివిధ రాజకీయ పక్షాలతో ప్రస్తుతం పొత్తుల ప్రసక్తి లేకుండా ప్రభుత్వంపై ఉద్యమాలు చేసేందుకు గానూ అఖిలపక్షంగా ఏర్పడాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కేవలం టీడీపీ మాత్రమే కాకుండా తమతో కలిసి వచ్చే అన్ని పార్టీలతో కలిసి ఉమ్మడి కార్యాచరణను రూపొందించాలని భావిస్తున్నారుట.

Chandrababu Naidu: That Caste Angry on TDP.. 12 Lakhs Voters

 

ఉమ్మడి కార్యచరణపై

ప్రస్తుతం రాష్ట్రం సంక్షేమ పథకాలు అమలు తప్ప అభివృద్ధి లేదు. అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను పెంచేందుకు భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు వైసీపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ కలుపుకుపోవాలని ప్లాన్ చేస్తున్నారుట. ఉమ్మడి కార్యచరణపై బీజేపీ, జనసేన, వామపక్షాలు, ప్రజా సంఘాలతో చర్చలు జరిపేందుకు చంద్రబాబు సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఇది కార్యరూపం దాలుస్తుందో లేదో వేచి చూడాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk