Chandrababu: జగన్మోహనరెడ్డి సర్కార్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడు వేదిక పై నుండి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ తనకు తాను కాపాడుకునేందుకు కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారాడని చంద్రబాబు విమర్శించారు. అమరావతిని చంపేశాడు, పోలవరం పూర్తి అవుతుందన్న నమ్మకం లేదన్నారు. ఎన్టీఆర్ హయాంలో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు తొలగిస్తే జగన్ వచ్చి మీటర్లు పెడుతున్నారన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్ .. ఇప్పుడు కేంద్రం కాళ్ల మీద పడే పరిస్థితి దాపురించిందని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజాభీష్టంకు అనుగుణంగా జిల్లాల విభజన పై పునః సమీక్ష చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు.
Chandrababu: జగన్ ను త్వరగా ఇంటికి పంపాలని ప్రజలు చూస్తున్నారు
గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నారు. సీఎం జగన్ ను త్వరగా ఇంటికి పంపాలనే ఉత్సాహం రాష్ట్ర ప్రజల్లో కనిపిస్తొందని అన్నారు. క్విట్ జగన్ – సేవ్ ఆంధ్రప్రదేశ్ అని అయిదు కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నారన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహిస్తుంటే పోటీగా గడప గడపకు ప్రభుత్వం అని నిర్వహించారనీ, గడప గడపకు వెళుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారన్నారు చంద్రబాబు. ఎన్ని అడ్డంగులు సృష్టించినా ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున మహానాడుకు తరలివచ్చారన్నారు. మహానాడు గ్రాండ్ సక్సెస్ చూసిన జగన్ కు ఈ రోజు నిద్ర రాదని అన్నారు చంద్రబాబు.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను పురస్కరించుకుని సంవత్సరం మొత్తం పార్టీ పరంగా కార్యక్రమాలు చేపట్టి ఆయన ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. ఇందు కోసం ప్రత్యేకంగా ప్రతి జిలాల్లో మహనాడు పెడతామన్నారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, అవినీతి విధానాలను ఎండగట్టేందుకు ముందుకు వెళ్దామన్నారు. రాజకీయ నేరగాళ్లు వచ్చారని అన్నారు. వైసీపీ ప్రభుత్వం 8 వేల కోట్లు అప్పు చేసిందనీ, సంక్షేమ పథకాల పేరిట లక్షల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. ఈ అప్పును జగన్ చెల్లిస్తారా అని ప్రశ్నించారు చంద్రబాబు. క్వార్టర్ బాటిల్ మందు ధర రూ.9లు ఉండేది దాన్ని ఈ ప్రభుత్వం రూ.21లు చేసిందన్నారు. అందులో 12 రూపాయలు జగన్ జేబులోకి వెళుతున్నాయని ఆరోపించారు. నాసిరకం మద్యం వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.
ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తామని, ఎవరినీ ఉపేక్షించేది లేదని చంద్రబాబు అన్నారు. జగన్ మాదిరిగా గతంలో టీడీపీ ప్రభుత్వం వ్యవహరించి ఉంటే వాళ్లు ఎక్కడ ఉండేవారని అన్నారు. సోషల్ మీడియా ద్వారా వైసీపీ ఆరాచకాలను ఎండగట్టాలన్నారు. కొన్ని మీడియా సంస్థకు జగన్ కు అనుకూలంగా మారిపోయాయన్నారు. సెల్ ఫోన్ ఆయుధంగా సామాజిక ఉద్యమం చేపట్టాలన్నారు. జగన్ ప్రభుత్వానికి ఉరివేసి బంగాళాఖాతంలో కలపాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.
నారా లోకేష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పునాదులు ఇప్పటికీ గట్టిగానే ఉన్నాయన్నారు. బస్సులు ఆపగలిగారు. కార్ల టైర్లలో గాలి తీయగాలిగారు కానీ టీడీపీ కార్యకర్తలను అపలేరని అన్నారు. శవాన్ని అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి అయిన ఘనత జగన్ కే దక్కుతుందని విమర్శించారు లోకేష్. అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా లక్షలాది మంది మహానాడుకు తరలివచ్చారని అన్నారు. నిన్నటి నుండి వరుస ప్రసంగాలతో లోకేష్ గొంతు బొంగురుపోయింది. అయినప్పటికీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు బొంగురు గొంతుతోనే లోకేష్ ప్రసంగాన్ని కొనసాగించారు.