NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: జగన్ బాటలోనే బాబు..!? అదే జరిగితే టీడీపీ చరిత్రలోనే మొదటి సారి..!

Chandrababu: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుండి జరగనున్న సంగతి తెలిసిందే. గత సమావేశాల్లో జరిగిన అవమానాలకు కలత చెందిన చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానని, అప్పటి వరకూ అసెంబ్లీకి రానంటూ శపథం చేసి బయటకు వచ్చారు చంద్రబాబు. అయితే అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హజరు కావాలా..?  వద్దా అనే దానిపై గత కొంత కాలంగా పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ పొలిట్ బ్యూరోలో ఇప్పటికే మెజార్టీ నేతలు చట్టసభలకు వెళ్లరాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Chandrababu TDP Meet on assembly session issue
Chandrababu TDP Meet on assembly session issue

Chandrababu: ఆన్ లైన్ ద్వారా టీడీఎల్పీ భేటీ

అయితే సోమవారం నుండి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హజరుపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ రోజు చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ ఈ మధ్యాహ్నం సమావేశం కానుంది. ఆన్ లైన్ ద్వారా జరిగే ఈ టీడీఎల్పీ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ సభకు హజరుకాకూడదని నిర్ణయం తీసుకుంటే ప్రత్యామ్నాయ కార్యక్రమాల నిర్వహణపైనా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ప్రధానమైన ఈ బడ్జెట్ సమావేశంలో మూడు రాజధానుల అంశం, జిల్లాల పునర్విభజన వంటి కీలక అంశాలు ఉండటంతో సమావేశాలను బహిష్కరించడం సమంజసమా కాదా అనే దానిపై చర్చ జరుగుతోంది.

సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంటే..

తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంటే జగన్ బాటలో పయనించినట్లు అవుతుంది. గతంలో పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయనందుకు నిరసనగా జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ సభ్యులు నిరవదికంగా అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేశారు. ఆ తరువాత ఆయన జనంలోకి వెళ్లారు. అయితే టీడీపీ ఆవిర్భావం తరువాత అనేక సార్లు ప్రతిపక్షంలో ఉంది. కానీ పూర్తి స్థాయిలో సమావేశాలను బహిష్కరించిన సందర్భాలు ఇంత వరకూ లేవు. ఇప్పుడు గనుక అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంటే టీడీపీ చరిత్రలో ఇది నిలిచిపోతుంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!