AP High Court: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ లను హైకోర్టు కొట్టేసింది. ఏపీ ఫైబర్ నెట్, అంగళ్లు అల్లర్లు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో ఇటీవల వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరుపున సుప్రీం కోర్టు న్యాయవాదులు వాదనలు వినిపించగా, ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదనలు వినిపించారు.
వాదనలు ముగిసిన అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఇవేళ ఉత్తర్వులు వెలువరించారు. అంగళ్ల కేసులో నిందితులకు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ 2 గా ఉన్న నారాయణకు ముందస్తు బెయిల్ లు లభించి ఉండటంతో చంద్రబాబుకు కూడా ముందస్తు బెయిల్ వస్తుందని టీడీపీ శ్రేణులు భావించారు. అయితే హైకోర్టు చంద్రబాబు దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది. మరో పక్క ఏసీబీ కోర్టులో స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ పై తీర్పులు ఈ మధ్యాహ్నం తర్వాత రానున్నాయి.
Chandrababu Arrest: చంద్రబాబు కేసుల్లో ఇవేళ ఏమి జరగబోతోంది ..? సర్వత్రా టెన్షన్..టెన్షన్..!!