Chandrababu: టీడీపీ ముందు రెండు ఆప్షన్లు… బీజేపీతో డీల్ కోసం..? లేదా భవిష్యత్ బెంగ..!

Share

Chandrababu: తెలుగుదేశం ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. బీజేపికి ఎదురు తిరగడం, మేము బీజేపీకి అనుకూలం కాదు, బీజేపీ మాకు భద్ద శత్రువు అని రాష్ట్రపతి ఎన్నికల్లో వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా జాతీయ స్థాయిలో చాటి చెప్పడం.  లేదు బీజేపీతో మాకు రిస్క్, బీజేపీతో మాకు ఇప్పుడు పేచీ వద్దు., బీజేపీతో మాకు సఖ్యతే కావాలి అని రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఓటు వేయడం. ఈ రెండింటిలో టీడీపీ ఏదో ఒకటి తేల్చుకోవాలి. టీడీపీ ఓట్లు వేసినా వేయకపోయినా ఎన్డీఏకి, బీజేపీ నష్టమేమి లేదు. పెద్ద లెక్క కాదు. వ్యతిరేక ఓటు వేస్తే రాజకీయ వైరం మొదలు అవుతుంది. రాజకీయ వైరం కొనసాగుతుంది. అనుకూలంగా ఓటు వేస్తే పాత వైరాలు కొంత వరకు తగ్గే అవకాశం ఉంటుంది. టీడీపీ ఓట్ల లెక్క ఏమిటి అనేది చూసుకుంటే..

Chandrababu two options on presidential poll

Chandrababu: బీజేపీతో పేచీ ఎందుకని..

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా ఉన్న ద్రౌపది ముర్ముకు బీజేపీ, దాని భాగస్వామ్య పక్షాలతో కలిపి 48.06 శాతం ఓటింగ్ ఉంది. దీనికితోడు బీజూ జనతాదళ్ (బీజేడీ), వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ఇచ్చాయి కాబట్టి దాదాపు 52 శాతంకుపైగా ద్రౌపది ముర్ముకు పడబోతున్నాయి. నూరు శాతం రాష్ట్రపతిగా ముర్ము గెలుపు ఖాయం. టీడీపీకి ఉన్న ఓటు విలువ 9వేలు అంటే 0.4 శాతం. ఇది పెద్ద లెక్క కాదు. కాకపోతే రాష్ట్రపతిగా గిరిజన మహిళను పెట్టారు కాబట్టి తాము కూడా ఓటు వేస్తాం, మాకు పార్టీలతో సంబంధం లేదు, బీజేపీతో, ఎన్డీఏతో సంబంధం లేదు, ఒక ఎస్టీ మహిళ రాష్ట్రపతి కాబోతున్నారు కాబట్టి భేషరతుగా మద్దతు ఇస్తామని చెప్పి ఓట్లు వేస్తారా..? లేదు మేము వేయం, యశ్వంత్ సిన్హా లాంటి ఆర్ధిక నిపుణుడు ఉండాలి అని వ్యతిరేక పక్షానికి టీడీపీ ఓటు వేయాలా అనేది తేల్చుకోవాలి.

Chandrababu: యశ్వంత్ సిన్హాతో చంద్రబాబుకు పాత పరిచయాలు

వాస్తవానికి యశ్వంత్ సిన్హాతో చంద్రబాబుకు మంచి పరిచయం ఉంది. గతంలో ఆయన కేంద్ర మంత్రిగా పని చేసిన సమయంలో ఉమ్మడి ఏపిలో చంద్రబాబు మంత్రిగా, ముఖ్యమంత్రిగా పని చేశారు. ఇద్దరి మధ్య మంచి సఖ్యత ఉంది. చంద్రబాబుకు ఉన్న పాత పరిచయాల కారణంగా యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తే బీజేపీకి దూరం అవుతారు. పొలిటికల్ గా ఇప్పటికే రిస్క్ లో ఉన్న టీడీపీని బీజేపీ ఇంకా రిస్క్ లోకి నెట్టే ప్రమాదం ఉంది. బీజేపీకి రాష్ట్రంలో ఓట్లు, సీట్లు లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల వ్యవస్థల ద్వారా రిస్క్ లోకి నెట్టే ప్రమాదం లేకపోలేదు. టీడీపీని ముప్పు తిప్పలు పెట్టగలరు. సో.. ఇటువంటి రిస్క్ అంతా ఎందుకు, బీజేపీతో పేచీ ఎందుకు, మనకు ఉన్న ఒకే ఒక శత్రువు జగన్మోహనరెడ్డిని చూసుకోవాలీ అనేది మాత్రమే టీడీపీ ఆలోచిస్తే బీజేపీ అభ్యర్ధికే మద్దతు ఇస్తారు. అందుకే టీడీపీ ఈ రెండు ఆప్షన్ లో ఏది ఎంచుకుంటుందో చూడాలి.

 

వారం పది రోజుల్లో ద్రౌపది ముర్ము ఏపి పర్యటన

ద్రౌపది ముర్ము ఓ వారం పది రోజుల్లో తన పర్యటనలో భాగంగా ఏపికి రాబోతున్నారు. అటు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబును ముర్ము కలిసే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ ఇప్పటికే మద్దతు ప్రకటించినందున ప్రోటోకాల్ ప్రకారం కలిసి ధన్యవాదాలు తెలియజేస్తారు. మరో పక్క రాష్ట్రపతి ఎన్నికల్లో 9వేల ఓట్లు కూడా ఇంపార్టెంట్ యే కాబట్టి చంద్రబాబును కూడా రాష్ట్రపతి అభ్యర్ధి ముర్ము కలిసే అవకాశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ ఓటు వేసినా వేయకపోయినా వచ్చే లాభ నష్టాలు లేకపోయినా రాజకీయ వైరం మాత్రం మార్పు వస్తుంది. రెండు రాజకీయ పార్టీల మధ్య గ్యాప్ మరింత పెరిగే అవకాశాలు ఏర్పడతాయి. దీనిపైనే టీడీపీ తీక్షణంగా ఆలోచిస్తోంది.


Share

Recent Posts

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

39 mins ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

1 hour ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

2 hours ago

స్ట్రీమింగ్‌కు సిద్ధ‌మైన న‌య‌న్‌-విగ్నేష్ పెళ్లి వీడియో.. ఇదిగో టీజ‌ర్!

సౌత్‌లో లేడీ సూప‌ర్ స్టార్‌గా గుర్తింపు పొందిన న‌య‌న‌తార ఇటీవ‌లె కోలీవుడ్ ద‌ర్శ‌క‌,నిర్మాత విఘ్నేష్ శివ‌న్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…

3 hours ago

కడుపు ఉబ్బరం సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి..!

ఆహారం లేకుండా జీవించాలంటే చాలా కష్టం.ఆహా అయితే ఒక రెండు మూడు రోజులు ఉండగలం. కానీ ఆహారం లేకుండా మాత్రం మనిషి మనుగడ లేదు.గుప్పెడు అన్నం మెతుకుల…

3 hours ago

లాల్ సింగ్ చడ్డా సినిమా కోసం నాగచైతన్య ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే..!

  అక్కినేని నాగచైతన్య మరో రెండు రోజుల్లో (ఆగస్టు 11న) థియేటర్స్‌లో రిలీజ్ కానున్న 'లాల్‌ సింగ్‌ చడ్డా' సినిమాతో బాలీవుడ్‌ డెబ్యూ ఇవ్వనున్నాడు. ఆమిర్‌ ఖాన్‌…

4 hours ago