NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YCP : విడదల రజిని క్రేజ్ చూస్తే , జగన్ ఐనా నోరెళ్ళబెట్టాల్సిందే !

YCP : గుంటూరు జిల్లా చిలకలూరిపేట chilakaluripeta నియోజకవర్గంలో హాట్రిక్ విజేత మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు pattipati pullarao (టీడీపీ) TDP పై మొదటి ఎన్నికల్లోనే విడతల రజిని vidatala rajani (వైసీపీ) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి వచ్చిన అతి కొద్దికాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఎన్‌ఆర్ఐగా వచ్చిన రజిని తొలుత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నియోజకవర్గంలో పత్తిపాటి పుల్లారావు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీకి ఈ నియోజకవర్గం కంచుకోట లాంటిది. అయితే ఆ పార్టీలో కొనసాగితే పుల్లారావును కాదని ఎమ్మెల్యే సీటు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో గత ఎన్నికల ముందు రజిని వైసీపీలో చేరారు. అయితే ఎన్నికల్లో పుల్లారావు విజయం ఖాయమని అందరూ అనుకున్నప్పటికీ రజిని ఊహించని రాజకీయం చేశారు. దానికి తోడు ఫ్యాన్ గాలి తోడు కావడంతో పత్తిపాటి హవాకు చెక్ పెట్టారు.

YCP : chilakaluripeta ycp mla vidatala rajini
YCP chilakaluripeta ycp mla vidatala rajini

ప్రజలు, నాయకులతో మమేకం అవుతూ నియోజకవర్గంలో మంచిపేరు తెచ్చుకోవడంతో పాటు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా రాష్ట్ర స్థాయిలో ఇమేజ్ సాధించారు రజిని. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఆమెకు సవాల్ గా మారాయి. గడచిన ఎన్నికల్లో ఓడిపోయిన పత్తిపాటి పుల్లారావు  ప్రజలకు మరింత దగ్గర అయ్యే ప్రయత్నాలు చేశారు. దీనికి తోడు రాజధాని అంశం కొంత టీడీపీకి అనుకూలంగా మారే పరిస్థితులు ఉన్నాయి. రజిని ఎమ్మెల్యే అయిన తరువాత నియోజకవర్గంలో పెద్దగా జరిగిన అభివృద్ధి అయితే ఏమీ లేదని అంటున్నారు. కానీ  ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాత్రం లబ్దిదారులకు అందుతున్నాయి. ప్రచారానికే రజిని ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే విమర్శలు ఉన్నాయి.  ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే రజిని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది.

YCP : chilakaluripeta ycp mla vidatala rajini
YCP chilakaluripeta ycp mla vidatala rajini

ప్రస్తుత పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి అయితే ఇక్కడ లేదని అంటున్నారు. నియోజకవర్గ పరిధిలో ఎడ్లపాడు, చిలకలూరిపేట, నాదెండ్ల మండలాలు ఉండగా ప్రస్తుతం ఈ మూడు మండలాల్లో టీడీపీ బలంగానే ఉందని అధికార వైసీపీకి గట్టిపోటీ ఇచ్చే పరిస్థితి ఉందని పేర్కొంటున్నారు. అయితే అధికార బలంతో నియోజకవర్గంలో రజిని అత్యధిక పంచాయతీలు కైవశం చేసుకునే వ్యూహాలు రచిస్తున్నారని అంటున్నారు. మండల స్థాయి నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థుల ఎంపిక, ఇతర విషయాలపై దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి.

విడతల రజిని సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తను నిర్వహించే కార్యక్రమాలకు సోషల్ నెట్ వర్క్ ద్వారా విస్తృత ప్రచారం లభిస్తోంది. నియోజకవర్గానికే పరిమితం కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రజిని సోషల్ మీడియా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, నియోజకవర్గ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పోస్టు చేస్తుంటారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సైతం విడతల రజిని పనితీరు పట్ల ముగ్దుడయ్యాడని అంటుంటారు. ఇకపోతే నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అనూహ్య విజయం సాధించిన రజిని పంచాయతీ ఎన్నికల్లో తన హవా చాటుతుందో లేదో వేచి చూడాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju