NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఇళ్ల పట్టాల పంపిణీ ఏమో కానీ ఆ వైసీపీ నేత బండారం బయటపడింది..! పోలీస్ కేసు..! పార్టీ నుండి సస్పెండ్..!!

 

ఎట్టకేలకు రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగలా ప్రారంభం అయ్యింది. స్థల సేకరణలో వివాదాలు, కోర్టు కేసులు తదితర కారణాలుగా నెలలు తరబడి వాయిదా పడుతూ వచ్చిన ఇళ్ల పట్టాల పంపిణీకి ముహూర్తం ఖరారు కావడంతో నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా అవినీతి అనేది తావు ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదేపదే చెబుతున్నారు.

ఇప్పటికే పలు ప్రాంతాల్లో పలు ప్రాంతాల్లో లబ్దిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన వార్డు వాలంటీర్లను విధుల నుండి కూడా తొలగించారు. ఈ పరిణామంతో చాలా వరకు వార్డు వాలంటీర్లు లబ్దిదారుల నుండి డబ్బులు తీసుకోవాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో కొందరు వైసీపీ నాయకులే ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామంటూ లబ్దిదారుల నుండి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఓ గ్రామంలో నాయకుడికి డబ్బులు ఇచ్చిన మహిళకు ఇళ్ల పట్టా మంజూరు కాకపోవడంతో ఆ నాయకుడి అవినీతి బహిర్గతం అయ్యింది. ఆ మహిళ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించడంతో అతని విషయం వెలుగులోకి వచ్చింది. పార్టీ నుండి సస్పెండ్ అయ్యారు.

విషయంలోకి వెళితే.. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పార్వతమ్మ అనే మహిళ కు ఇంటి స్థలం మంజూరు చేయిస్తానంటూ ఆ ప్రాంత వైసీపీ నాయకుడు సురేంద్ర రూ.30వేలకు ఒప్పందం చేసుకున్నాడు. అడ్వాన్స్ గా రూ.5వేలు తీసుకున్నాడు. అయితే ఇళ్ల పట్టాల పండుగ వచ్చేసింది కానీ లిస్ట్ లో ఆమె పేరు లేకపోవడంతో అనుమానం వచ్చిన ఆ మహిళ సురేంద్రను నిలదీసింది. అధికార పార్టీ నాయకుడు కదా ఆమెపైనే తిరుగబడ్డాడు. అయితే ఆమె ఈ సమస్యను అంతటితో వదిలివేయదల్లుకోలేదు. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేయగా ఆ నాయకుడు ఈమె వద్ద నుండే కాక మరి కొంత మంది వద్ద నుండి డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. పలువురు బాధితులు నేరుగా ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబుకు ఆ వైసీపీ నాయకుడి నిర్వాకంపై పిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు..సురేంద్రను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ,సురేంద్ర చిత్తూరు పార్లమెంట్ బీసి సంక్షేమ సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొందరు తమ పదవులను అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకోవాలని చూస్తుంటారు. ఇలా వెలుగులోకి వచ్చిన సందర్భాల్లో పరువు పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు దాపురిస్తుంటాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju