NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ సినిమా

Cine Director Deva Katta: ఏపి సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ నుండి ఫస్ట్ రెస్పాన్స్ ఇదీ..!!

Cine Director Deva Katta: ఏపి ప్రభుత్వం సినిమా టికెట్ల్ విక్రయం విషయంలో ప్రత్యేక పోర్టల్ ద్వారా అమ్మాలని తీసుకున్న నిర్ణయంపై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి మొదటి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయాలపై తరచు ప్రశంసల ట్వీట్లు చేసే అగ్రనటులు ఎవ్వరూ దీనిపై స్వాగతిస్తున్నట్లు గానీ, వ్యతిరేకిస్తున్నట్లు గానీ ట్వీట్లు చేయలేదు. అయితే సినీ దర్శకుడు దేవకట్టా జగన్ నిర్ణయంపై స్పందించారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తప్పంటూ ధైర్యంగా ప్రకటించారు.

Cine Director Deva Katta reaction on ap cm ys jagan decision
Cine Director Deva Katta reaction on ap cm ys jagan decision

ఏపి ప్రభుత్వం సినిమా టికెట్ల విక్రయం కోసం ప్రత్యేక పోర్టల్ ప్రారంభించడానికి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తమిళనాడులో ఈ సిస్టమ్ అమలులో ఉంది. అక్కడ అమలు అవుతున్న ఈ విధానాన్ని ఎత్తివేయాలని సినీ రంగం నుండి ఎటువంటి డిమాండ్ రాలేదు. దీంతో జగన్ తమిళనాడు తరహా పరిపాలనా విధానంలో భాగంగా తొలుత ప్రభుత్వ మద్యం దుకాణాలను తెరిచారు. దీని వల్ల ప్రభుత్వానికి విపరీతంగా ఆదాయం వస్తుంది. ఇప్పుడు తాజాగా అక్కడ సినీ రంగంలో అమలు అవుతున్న ఆన్ లైన్ టికెట్ ల విధానం ఇక్కడ అమలు చేస్తే ప్రభుత్వానికి ప్రయోజనకరంగా, ప్రజలకు ఉపయోగంగా ఉండటంతో పాటు బ్లాక్ మనీ నియంత్రించవచ్చన్న భావనతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజల నుండి పెద్దగా విమర్శలు గానీ వచ్చే అవకాశం లేదు. సినీ రంగానికి చెందిన వారికే ఈ నిర్ణయం కొంత ఇబ్బంది కల్గిస్తుంది. కానీ వీళ్లు నేరుగా ప్రభుత్వంతో పేచీ పెట్టుకోవడానికి సాహసించే పరిస్థితి ఉండదు. దీంతో జగన్ సినీ రంగ ప్రముఖులతో ఎటువంటి చర్చలు జరపకుండానే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అగ్ర నిర్మాతలు గానీ ప్రముఖ హీరోలుగానీ ఇంత వరకూ పెదవి విప్పలేదు. అయితే వెన్నెల, ప్రస్థానం, ఆటోనగర్ సూర్య వంటి సినిమాలను చిత్రీకరించిన దర్శకుడు దేవకట్టా స్పందించారు.

ప్రభుత్వరంగ సంస్థలు అయిన రైల్వేస్ వంటి వాటి విషయంలో ప్రభుత్వం ఆన్ లైన్ టికెట్లు పెట్టి విక్రయించడం సమంజసమే కానీ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన సినిమాల విషయంలో ప్రభుత్వం ఈ పద్ధతి అనుసరించడం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు దేవకట్టా. ప్రైవేటు కాంట్రాక్టర్ ల మాదిరిగా సినీ నిర్మాతలు కూడా ప్రభుత్వం ముందు తమ డబ్బు కోసం వేచి ఉండాల్సి వస్తుందేమో అని కూడా వ్యాఖ్యానించారు. సినీ నిర్మాతల విషయంలో ఈ విధంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వం సినీ నిర్మాణ విషయంలో బడ్జెట్ కేటాయించి సహకరిస్తుందా అని దేవకట్టా ప్రశ్నించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Nindu Noorella Saavasam March 28 2024 Episode 196: అరుంధతి నగలు తీసుకున్నా మనోహరీ ఏం చేయనున్నది..

siddhu

Naga Panchami March 28  2024 Episode 316: వైదేహిని అనుమానిస్తున్న మోక్ష, పంచమికి అన్నం తినిపిస్తున్న వైదేహి..

siddhu

Mamagaru March 28 2024 Episode 172: గంగాధర్ కి ముద్దు పెట్టిన గంగ, టిఫిన్ కి బదులు కొబ్బరి చిప్పలు తెచ్చిన చ0గయ్య..

siddhu

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

siddhu

Malli Nindu Jabili March 28 2024 Episode 609: మాలినికి పెళ్లి చేయాలను చూస్తే ఆపేస్తాను అంటున్న మల్లి, నీలాంటి మాల్లి లు 100 మంది ఆపలేరు అంటున్న వసుంధర..

siddhu

Ram Charan: రామ్ చరణ్ తో స్నేహం గురించి కీలక వ్యాఖ్యలు చేసిన మంచు మనోజ్..!!

sekhar

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri