Raghavendra Rao: తెలుగు తమ్ముళ్లకు బూస్ట్ ఇచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాటలు

Share

Raghavendra Rao: రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో టీడీపీ (TDP) ఘోర పరాజయం తరువాత ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. వరుసగా నేతలపై కేసులు నమోదు చేస్తూ అరెస్టులు చేయడంతో చాలా మంది నేతలు సైలెంట్ అయిపోయారు. అధికార పార్టీ ధీటుగా కార్యకర్తలు పని చేసే పరిస్థితి కొరవడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో (Local Body Elections) గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయారు. అయితే ఇటీవల ఒంగోలులో మహానాడు (Mahanadu) విజయవంతం అయిన తరువాత ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం వచ్చింది. తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్ర రావు చేసిన కామెంట్స్ తెలుగుతమ్ముళ్లలో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

Cine director Raghavendra Rao Key comments on TDP

రాష్ట్రంలో టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సావాల్లో భాగంగా తెనాలిలో 360 రోజుుల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరో పక్క బాపట్ల జిల్లా చుండూరు మండలం నడిగడ్డపాలెంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ రోజురోజుకు తెలుగు దేశం పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్నారు.

రెండేళ్లలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని రాఘవేంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారం చేపట్టడం తథ్యమని ఘంటాపథంగా చెప్పారు రాఘవేంద్రరావు. కార్యకర్తలు ఇదే ఉత్సాహం కొనసాగించాలని కోరారు. ఎన్టీఆర్ దార్శనికుడనీ, నేటి తరం నాయకులు ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఎన్నో హిట్ చిత్రాలను ప్రజలకు అందించిన దర్శకుడు రాఘవేంద్రరావు టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి అనుబంధంగా, అభిమానిగా ఉన్న సంగతి తెలిసిందే.


Share

Recent Posts

పాపం.. అఖిల్‌ ఆ క‌ష్టం నుండి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో?

నాగార్జున వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌ను మూడ‌గ‌ట్టుకున్నాడు. ఈయ‌న నుండి వ‌చ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…

16 mins ago

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

1 hour ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

1 hour ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago