Ap minister Perni Nani: సినీ వివాదంలో బిగ్ ట్విస్ట్..! మంత్రి పేర్ని నానిని కలిసిన నిర్మాతల బృందం..!!

Share

Ap minister Perni Nani: సినిమా వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. పలువురు సినీ నిర్మాతలు బుధవారం మచిలీపట్నంకు చేరుకుని పేర్ని నానితో భేటీ అయ్యారు. నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసు తదితరులు మంత్రి నానిని కలిశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, మంత్రి పేర్ని నాని మద్య విమర్శలు రాజుకున్న సమయంలో మంత్రి వద్దకు నిర్మాతల బృందం రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నిన్న మంత్రి పేర్ని నానికి మధ్యవర్తులు ఫోన్ చేసి నిర్మాతలు వస్తారని తెలపడంతో మంత్రి పేర్ని నాని వారికి ఆపాయిట్మెంట్ ఇచ్చారు. దీంతో నిర్మాతల బృందం నేడు మచిలీపట్నంకు చేరుకుని మంత్రి పేర్ని నానితో బేటీ అయ్యారు.

cine producers meet Ap minister Perni Nani
cine producers meet Ap minister Perni Nani

Ap minister Perni Nani: ఏపి ప్రభుత్వంపై పవన్ ఘాటు వ్యాఖ్యలు

రెండు రోజుల క్రితం సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మువీ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనపై కోపంతో సినీ పరిశ్రమను దెబ్బతీసే విధంగా చర్యలు తీసుకుంటోందని, అందుకే ప్రభుత్వమే సినిమా టికెట్లు విక్రయించాలని చూస్తోందని విమర్శించారు. ఏపి ప్రభుత్వం మాత్రం సినీ ప్రముఖల విజ్ఞప్తి మేరకే సినిమా టికెట్ల ఆన్ లైన్ బుకింగ్ పై చర్యలు తీసుకుంటోందని చెబుతున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ ఇబ్బందులపై సినీ పెద్దలు ప్రభుత్వాన్ని బతిమిలాడటం మానుకొని గట్టిగా మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఇటు అన్న చిరంజీవి, అటు సీనియర్ నటుడు మోహన్ బాబుకు పవన్ కల్యాణ్ సూచించారు.

పోసాని దిగ్టిబొమ్మలు దగ్దం చేసిన పవన్ అభిమానులు

అయితే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపి మంత్రుల తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్సా సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పవన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. మరో పక్క నటుడు పోసాని కృష్ణమురళి పవన్ ను వ్యక్తిగతగా టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం తీవ్ర దుమారానికి దారి తీసింది. పవన్ అభిమానులు ఆయనపై సీరియస్ కావడంతో పాటు దాడికి కూడా యత్నించారు. పోలీసుల రక్షణ కల్పించి పోసానిని ప్రెస్ క్లబ్ నుండి ఇంటికి పంపించారు. ఆ తరువాత పవన్ అభిమానులు పోలీసు స్టేషన్ కు వెళ్లి పోసానిపై ఫిర్యాదులు కూడా చేశారు. మరో పక్క పోసాని వ్యాఖ్యలను ఖండిస్తూ ఏపిలో పలు ప్రాంతాల్లో అభిమానులు పోసాని దిష్టిబొమ్మలను దగ్ధం చేసి నిరసనలు వ్యక్తం చేశారు. ఈ వివాదం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో సినీ నిర్మాతలు మంత్రి పేర్ని నానిని కలవడం అటు సినీ వర్గాల్లో ఇటు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

Read More: Badvel By Poll: బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ – జనసేన పోటీపై సోము వీర్రాజు ఇచ్చిన క్లారిటీ ఇదీ..!!

 


Share

Related posts

BJP : ఆ రాష్ట్రంలో బీజేపీ వేసే పాచిక‌… పీకేను ప్యాక‌ప్ చేస్తుందా?

sridhar

స్త్రీ , పురుషుల సమస్యలకు ఆహారం లో ఈ ఒక్కటి తీసుకుంటే మంచి ఫలితం పొందవచ్చు!!

siddhu

పెద్ద గుడ్ న్యూస్ చెప్ప‌నున్న కేసీఆర్ … ట్విస్ట్ ఏంటో తెలుసా?

sridhar