CJI Justice NV Ramana: వివిధ రంగాల్లో ప్రముఖులు తమ పదవీ విరమణ తరువాత వివిధ రకాల కార్యక్రమాలకు ప్లాన్ చేసుకుంటుంటారు. కొందరు సమాజ సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తుంటారు. మరి కొందరు విశ్రాంత జీవనం గడుపుతుంటారు. ఉంకొందరు వేరే వేరే వ్యాపకాలు పెట్టుకుంటుంటారు. గతంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గా బాధ్యతలు నిర్వహించిన గొగొయ్ పదవీ విరమణ తరువాత రాజ్యసభ సభ్యుడుగా ఎన్నికైయ్యారు. అయితే ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఏపికి చెందిన జస్టిస్ వెంకట రమణ కొద్ది నెలల్లో పదవీ విరమణ అవ్వనున్నారు. ఆయన పదవీ విరమణ తరువాత చేపట్టబోయే కార్యక్రమం టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అభిమానులను ఆనందింపజేసేదిగా ఉంది.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని తిరుపతిలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్ని జస్టిస్ ఎన్వీ రమణ ..ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై గతంలో ఎన్టీఆర్ మనిషి అన్న ముద్ర వేశారనీ, దానికి తాను గర్విస్తున్నానని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న జస్టిస్ ఎన్వీ రమణ .. తాను పదవీ విరమణ తర్వాత ఎన్టీఆర్ పై పుస్తకం రాస్తానని తెలిపారు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని వివరిస్తూ ఆయనతో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. విద్యార్ధి దశలో ఉన్న నాటి నుండి తాను ఎన్టీఆర్ ను అభిమానించేవాడినని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు.
సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ తరపున వాదించడానికి ఎవరూ ముందుకు రాలేదని పేర్కొన్నారు. అయినా ఆయన కేవలం ప్రజాబలంతోనే తిరిగి అధికారాన్ని చేజిక్కించుకున్నారని తెలిపారు. అధికారం కోల్పోయిన తరువాత ఎన్టీఆర్ వెంట ఎవరూ రాలేదనీ, ఆ వైనాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు జస్టిస్ ఎన్వీ రమణ. ఢిల్లీ వెళ్లే సమయంలో ఎన్టీఆర్ తనను తోడుగా తీసుకువెళ్లే వారనీ, ఢిల్లీలో ఆయనకు మందులు కూడా తాను అందించానని తెలిపారు. ఎన్టీఆర్ ను ఓ సమగ్ర సమతా మూర్తిగా అభివర్ణించారు జస్టిస్ ఎన్వీ రమణ.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…