NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

CM Jagan Delhi Tour: జగన్ ఢిల్లీ టూర్ మరో సారి గ్రాండ్ సక్సెస్ ..ప్రధాని మోడీ సహా నలుగురు కేంద్ర మంత్రులను కలిసిన సీఎం జగన్

CM Jagan Delhi Tour: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ పర్యటన మరో సారి గ్రాండ్ సక్సెస్ అయ్యింది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లి ఏపి సీఎం వైఎస్ జగన్..   ప్రధాన మంత్రి మోడీతో పాటు నలుగురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై వినతి పత్రాలను అందించారు. నిన్న మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న సీఎం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పలు ప్రధాన పెండింగ్ సమస్యలను ప్రధాన మంత్రి మోడీ దృష్టికి సీఎం జగన్ తీసుకువెళ్లారు. పెండింగ్ సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు

CM Jagan Delhi Tour success
CM Jagan Delhi Tour success

CM Jagan Delhi Tour: నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్, అమిత్ షాతో

అనంతరం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, హోంశాఖ మంత్రి అమిత్ షాతో విడివిడిగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, సవరించిన పోలవరం అంచనా వ్యయానికి ఆమోదం, రెవెన్యూ లోటు భర్తీ, రుణ పరిమితి పెంపు తదితర అంశాలను జగన్ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తదుపరి గజేంద్ర సింగ్ షెకావత్ జరిగిన భేటీలో పోలవరం పనులు త్వరగా పూర్తయ్యేలా సహకరించాలని కోరారు. సాంకేతిక సలహా కమిటీ నిర్ధారించిన పోలవరం అంచనాలకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. కాంపొనెంట్ వారీగా కాకుండా మొత్తం ప్రాజెక్టు పనులు పరిగణలోకి తీసుకుని బిల్లులు చెల్లించాలని కోరారు. నిర్వాసిత కుటుంబాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. తదుపరి అమిత్ షా భేటీలో విభజన హామీలపై చర్చించి త్వరగా పరిష్కరించాలని కోరారు.

నితిన్ గడ్కరీతో

కాగా ఈ రోజు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్  సమావేశమైయ్యారు. రాష్ట్రానికి సంబంధించి కీలక రోడ్డు ప్రాజెక్టులపై చర్చించారు. విశాఖ నుండి వేగంగా భోగాపురం చేరేందుకు సౌకర్యవంతమైన రోడ్డుతో పాటు పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా ప్రాజెక్టు తీర్చిదిద్దేందుకు తగిన సహాయ సహకారాలు అందించాలని సీఎం కోరారు. విజయవాడలో బైపాస్ ల నిర్మాణంపై చర్చించారు. రాష్ట్రంలో 20 ఆర్వోబీలను మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రాంతాలు, పారిశ్రామిక నోడళ్లు, స్పెషల్ ఎకనమిక్ జోన్లను కలుపుతూ 1723 కిలో మీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తగా ఏర్పడిన జిల్లాల కేంద్రాలను కలుపుతూ ఈ రోడ్ల నిర్మాణం చేపట్టాలని జగన్ విజ్ఞప్తి చేశారు.

జగన్ విజ్ఞప్తులపై సానుకూల స్పందన

కాగా గడ్కారీతో భేటీతో ముగిసిన తరువాత సీఎం జగన్ తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ ఏడాది ఢిల్లీ పర్యటనకు వెళ్లడం జగన్ ఇది రెండవ సారి. జనవరిలో ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు అయిదుగురు మంత్రులను కలిసి వచ్చారు జగన్. అదే మాదిరిగా ఈ సారి కూడా పీఎంతో సహా నలుగురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించి సమస్యలపై చర్చించారు. జగన్ విజ్ఞప్తులపై మంత్రులు సానుకూలంగా స్పందించారని వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో జగన్ ఢిల్లీ టూర్ ఈ సారి కూడా సక్సెస్ అయ్యిందని చెప్పవచ్చు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?