YS Jagan: కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం మల్లాయిగూడెంలో లబ్దిదారులకు టిడ్కో ఇళ్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఉచితంగా టిడ్కో ఇళ్లు రూపాయికే ఇస్తామని గుడివాడలోనే హామీ ఇచ్చామనీ, ఆ హామీని నిజం చేసి చూపిస్తున్నామన్నారు. టిడ్కో ఇళ్లతో కొత్త గుడివాడ నగరం కనిపిస్తొందన్నారు. 16,240 గృహాలు అంటే 40వేలకుపైగా జనాభా ఉంటారన్నారు. కడుతున్నది ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నామన్నారు. పది లక్షల రూపాయల ఆస్తిని ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఇదే సందర్భంలో చంద్రబాబు, ప్రతిపక్షాలపై మరో సారి విమర్శనాస్త్రాలు సంధించారు.

చంద్రబాబు హయాంలో చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు జగన్. ఒక్క ఇళ్ల పట్టా ఇవ్వలేదు, ఒక్క ఇళ్లు కట్టి లబ్దిదారుడికి ఇవ్వలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 30లక్షల 60వేల పట్టాలు ఇచ్చామన్నారు. రెండు దశల్లో 21 లక్షల ఇళ్లు నిర్మాణం జరిగిందన్నారు. టిడ్కో ఇళ్ల ద్వారా రూ.16,601 కోట్లు వెచ్చించామన్నారు. ఇళ్ల మహాయజ్ఞం ద్వారా 2 – 3 లక్షల కోట్ల ఆస్తిని ప్రతి అక్క చెల్లెమ్మల చేతిలో పెడుతున్నామన్నారు. దేవుడు తనకు ఇచ్చిన అవకాశానికి ఇంత కన్నా సంతోషం ఉంటుందా అని అన్నారు. కొంత మందికి ఈర్ష్య ధ్వేషం ఎక్కువ అయ్యాయని అన్నారు. చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్లకు పేద వాడి పేరు మీద రూ.3లక్షలు అప్పుగా రాశారని, దీనికి లబ్దిదారుడు ప్రతి నెల రూ.3వేల చొప్పున 20 ఏళ్ల పాటు కడుతూ పోవాలన్నారు. పేదవాడు 300 అడుగుల ఇంటిని సొంతం చేసుకునేందుకు రూ.7.20లక్షలు జేబు నుండి కట్టాలన్నారు. అది చంద్రబాబు హయాంలో తెచ్చిన టిక్కో పథకమన్నారు.
మీ బిడ్డ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 300 చదరపు అడుగుల లో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లు 1,43,600 ఇళ్లు, అన్ని హక్కులతో ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం, వీటి విలువ రూ.6.65 లక్షలు, వీటిని ఒక్క రూపాయికే ఇస్తున్నామన్నారు. ప్రతి పేదవాడికి రూ.4,25 లక్షలు సబ్సిడీ ఇస్తున్నామన్నారు. చంద్రబాబు హయాంలో చేసింది ఏమీ లేదని అన్నారు. గుమాస్తా గిరీ పని కూడా సరిగ్గా చేయలేదన్నారు. తాను చేయని పనులు చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం తప్ప చేసిందేమిటి అని ప్రశ్నించారు. నాలుగేళ్లలో మనందరి ప్రభుత్వం ఇన్ని లక్షల ఇళ్లు ఎలా కట్టగలిగింది ఆలోచన చేయాలన్నారు. ఇదే పనిని 30 ఏళ్ల క్రితమే సీఎం అయిన ఈ బాబు ఎందుకు చేయలేకపోయాడు అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలన్నారు. బాబు పేదల వ్యతిరేకి కాబట్టి చేయలేదన్నారు.
అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలిస్తే అక్కడ డెమోగ్రఫిక్ ఇన్ బ్యాలెన్స్ వస్తుందని ఏకంగా కోర్టుల్లో కూడా నిస్సిగ్గుగా వాదించారన్నారు. అదే అమరావతిలో 50వేల మంది అక్కచెల్లెమ్మలకు సుప్రీం కోర్టు వరకూ వెళ్లి పోరాడి ఇళ్ల స్థలాలు ఇచ్చామన్నారు. చంద్రబాబుకు ఓటు అడిగే నైతికత లేకుండా పోయిందన్నారు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి ఇంటికి కేజీ బంగారం అంటారు. ఇంకో ఛాన్స్ ఇవ్వండి బెంజి కారు ఇస్తామంటాడని ఎద్దేవా చేశారు. మంచి చేసిన చరిత్ర పెద్దమనిషికి లేదన్నారు. వారిది గజ దొంగల పార్టీ….పెత్తందారుల పార్టీ. తోడేళ్లందరూ కలిసినా భయపడను. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికుల్లా నిలబడండి అని జగన్ పిలుపునిచ్చారు.
జమ్ముకశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు విదేశీ ఉగ్రవాదులు హతం