NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

CM Jagan: ఇంటి వద్దే మంచానికి పరిమితమైన రోగులకు శుభవార్త చెప్పిన సీఎం జగన్..!!

Share

CM Jagan: గురువారం పల్నాడులో పర్యటించిన సీఎం జగన్.. లింగంగుంట్లలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొత్తగా “ఫ్యామిలీ డాక్టర్” కాన్సెప్ట్ చేపడుతున్నట్లు.. కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి “ఫ్యామిలీ డాక్టర్” విధానం అమలు చేయబోతున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దేశంలోనే గొప్ప మార్పునకు లింగంగుంట్ల వేదికైందని అన్నారు. ఈ వైద్య సేవల విధానం దేశ చరిత్రలోనే ఇదొక నూతన అధ్యాయం అని సీఎం జగన్ స్పష్టం చేశారు. “ఫ్యామిలీ డాక్టర్” కాన్సెప్ట్ కచ్చితంగా దేశ చరిత్రలోనే రోల్ మోడల్ గా నిలుస్తుందని పేర్కొన్నారు. వైద్యుడు కోసం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆసుపత్రి… వైద్యులు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ప్రతి పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదనే ఈ “ఫ్యామిలీ డాక్టర్” కాన్సెప్ట్ తీసుకొచ్చినట్లు జగన్ పేర్కొన్నారు.

CM Jagan gave good news to patients confined to bed at home

ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ద్వారా వ్యాధులు ముదరకముందే… గుర్తించవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 2000 జనాభాకు ఓ విలేజ్ క్లినిక్ ఉంటుంది. ఈ విలేజ్ క్లినిక్ లో CHO, ANM, ఆశా వర్కర్ లు ఉంటారు. ప్రతి 2000 జనాభాకు ఓ క్లినిక్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. ఇంకా మండలానికి రెండు PHC లు. ప్రతి PHC లో ఇద్దరు వైద్యులు ఉంటారు. ఒకరు PHCలో ఉంటే… మరొకరు అంబులెన్స్ లో తిరుగుతుంటారు. వైయస్సార్ విలేజ్ క్లినిక్ లను …PHC లతో అనుసంధానం చేస్తాం. వైయస్సార్ విలేజ్ క్లినిక్ లో 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు, 105 రకాల మందులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. సాధారణ వైద్య సేవలతో పాటు తల్లులు మరియు బాలింతలకు వైద్య సేవలు ఉంటాయని సీఎం జగన్ పేర్కొన్నారు.

CM Jagan gave good news to patients confined to bed at home

అన్ని వైద్య సేవలు గ్రామంలోనే అందించే గొప్ప పథకం ఇది. ఇంకా ఇంటి వద్ద మంచానికి పరిమితమైన రోగులకు వైద్యులు ఇంటి వద్దకే వచ్చి వైద్యం అందిస్తారని సీఎం జగన్ శుభవార్త తెలియజేశారు. ఈ క్రమంలో పెద్ద వ్యాధులు గుర్తిస్తే విలేజ్ క్లినిక్ ఆరోగ్యశ్రీకి రెఫర్ చేస్తుంది అని సీఎం జగన్… ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కార్యక్రమం గురించి ప్రసంగించారు. కచ్చితంగా ఇది దేశంలోనే గొప్ప కార్యక్రమం అవుతుందని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ తో పాటు వైద్యశాఖ మంత్రి విడుదల రజిని ఇంకా పల్నాడు వైసీపీ పార్టీ కీలక నాయకులు, ఎమ్మెల్యేలు పాల్గొనడం జరిగింది.


Share

Related posts

ACB Trap: ఏసీబీకి చిక్కిన ఇద్దరు రెవెన్యూ అధికారులు..! లంచం ఎంత డిమాండ్ చేసారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

somaraju sharma

TTD : అంజనాద్రియే హనుమంతుడి జన్మస్థలం..అధికారికంగా ప్రకటించిన టీటీడీ

somaraju sharma

పక్క షేమ్! ఇలాంటి వారితో నెట్టుకురాలేవు జగన్!

Comrade CHE